Gary Ballance: జింబాబ్వే క్రికెటర్ హిస్టరీ.. రెండు దేశాల తరఫున..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gary Ballance Becomes 16th Cricketer Play Tests For 2 Nations: జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ చరిత్ర సృష్టించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్, జింబాబ్వే) తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 16వ క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. విడ్డూరమైన విషయం ఏంటంటే.. బ్యాలెన్స్ తొలుత పరాయి దేశం ఇంగ్లండ్ తరఫున ఆడి, ఆ తర్వాత సొంత దేశానికి ఆడాడు. క్రికెట్ చరిత్రలో ఒక క్రికెటర్ ఇలా రివర్స్‌లో ఆడటం ఇదే మొదటిసారి. ఆల్రెడీ రెండు దేశాల తరఫున ఆడిన 15 మంది క్రికెటర్లు తొలుత తమ సొంత దేశం తరఫున ఆడారు. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఇతర దేశాల తరఫున ప్రాతినిథ్యం వహించారు. కానీ.. బ్యాలెన్స్ మాత్రం రివర్స్‌లో మొదట ఇంగ్లండ్ తరఫున ప్రాతినిథ్యం వహించి, ఇప్పుడు సొంత దేశానికి ఆడుతున్నాడు.
Jr NTR: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. NTR30 సీక్రెట్స్ చెప్పేసిన తారక్
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
నిజానికి.. గ్యారీ బ్యాలెన్స్ జింబాబ్వేలోనే పుట్టి, పెరిగి, విద్యను అభ్యసించాడు. అయితే.. 2006లో బ్రిటన్‌కు వెళ్లి, అక్కడే స్థిరపడ్డాడు. క్రికెట్ మీద ఉన్న ప్రేమతో, ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నాడు. ఆ కలల్ని సాకారం చేసుకున్నాడు కూడా. కౌంటీల్లో సత్తా చాటి.. 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. 2017 వరకు, అంటే నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ.. ఆ తర్వాత ఫామ్‌లేమీ కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్.. ఆతర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి జట్టులో స్థానం పొందడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ, అతనికి అవకాశాలు రాలేదు. దీంతో.. అతడు తిరిగి తన సొంత గూటి అయిన జింబాబ్వేకి చేరుకున్నాడు.
Jr NTR: అమిగోస్ ఈవెంట్ సాక్షిగా.. ఫ్యాన్స్‌కి క్లాస్ పీకిన ఎన్టీఆర్
ఫిబ్రవరి 4వ తేదీన వెస్టిండీస్‌తో మొదలైన టెస్ట్ మ్యాచ్ ద్వారా గ్యారీ బ్యాలెన్స్ జింబాబ్వే తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు ఆడిన గ్యారీ.. 37.5 సగటున 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో కలిపి 1498 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరఫున 18 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!