అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 నుంచి భువనేశ్వర్‌లో నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈనెల 26న భువనేశ్వర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ…
విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి విడదల రజనీ, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2014 నుంచి…
వైవీ సుబ్బారెడ్డి రాకతో కలిగే ప్రయోజనాలపై చర్చ.ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వే విశాఖపట్నం. ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువుపట్టు. ఇక్కడ ఫలితాలు పార్టీల పటిష్టత, భవిష్యత్‌ను నిర్ధేశిస్తాయి. అందుకే అందరి దృష్టీ ఎప్పుడూ విశాఖపై ఉంటుంది. వచ్చే రెండేళ్లూ ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఫోకస్ మరింత పెరిగింది. ఈ క్రమంలో వైసీపీ సంస్థాగతంగా కీలకమైన మార్పులు చేసింది. ఉమ్మడి విశాఖజిల్లా సమన్వయకర్త బాధ్యతలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భుజాలపై పెట్టింది అధికార పార్టీ. కొత్త బాస్‌రాకతో…
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ దగ్గర తోపులాట కలకలం రేపింది.. పెద్ద ఎత్తున భక్తుల తరలిరావడం.. ఒక్కసారిగా అంతా ఎగబడడంతో తోపులాట జరిగింది.. అయితే, మూడు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన ఈ తోపులాటపై స్పందించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ప్రతిపక్షాలు దేవున్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నాయని మండిపడ్డారు.. సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో కొంత మేరకు తోపులాట జరిగినా దేవుడి దయవల్ల ఎవరికీ ప్రాణా పాయం జరగలేదన్న ఆయన.. ఈ సంఘటన…
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోరమైన నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు ఇటీవల టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా చేరారని అటువంటి వారిని వెంటనే తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. నేరచరిత ఉన్నవారిని ఆలయ పాలకమండలిలో సభ్యులుగా ఎలా నియమిస్తారని.. భగవంతుని సేవలో నేరచరితులు ఉండటాన్ని ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వంపై, టీటీడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.…
ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది. ఆయన తండ్రి మేకపాటి కూడా పార్టీకి ఎనలేని సేవలు అందించారు. కాసేపట్లో సీఎం కూడా హైదరాబాద్ కు బయలుదేరతారని తెలిపారు. ఇంత చిన్న వయస్సులో ఆయన హఠాన్మరణం నమ్మలేకుండా ఉంది. చిన్న వయస్సులో గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటు. ఇప్పడే ఈ విషయం…
టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని వ్యాపార లావాదేవీలు బయట పడ్డాయని తిరుపతి అసెంబ్లీ జనసేన పార్టీ ఇంఛార్జీ కిరణ్ రాయల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీలో పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఏమనుకుంటే అది జరుగుతాయా…? ఈ విషయాలు అన్ని ఎస్వీబీసీ లైవ్ ద్వారా బయటకు వచ్చాయని ఆయన అన్నారు. ఉదయస్తమాన సేవా టికెట్లను సినిమా టికెట్లు తరహాలో పాలక మండలి సభ్యులు వాటలేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లైవ్ ద్వారా అందరూ…
ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చే అవసరం వైసీపీకి లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి, జగన్ భేటీలపై స్పందించారు. జూన్‌లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి సీఎం జగన్ నిర్ణయం మేరకు పరిశీలిస్తామన్నారు.సీఎం జగన్ నిర్ణయం ప్రకారం ఎవరికి అవకాశం ఇస్తే వారు రాజ్యసభ సభ్యులవుతారన్నారు. పార్టీ కోసం పని చేసి.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరు బాగా ఉపయోగపడతారో వారికి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని పేర్కొన్నారు.…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది. కోవిడ్ నిభందనలు సడలిస్తే…పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం. 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం…
తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లండ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల సంస్థ టీటీడీకి సర్టిఫికెట్ అందజేసింది. ఈ సర్టిఫికెట్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల సంస్థ ప్రతినిధులు స్వయంగా అందజేశారు. Read Also: తిరుపతి కౌన్సిల్ సమావేశంతో ఒరిగేదేంటి? ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచంలో…