టీటీడీ పాలకమండలి ఇవాళ జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది. చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం లభించగా.. చెన్నై కేంద్రానికి ఏజే శేఖర్ రెడ్డి, బెంగళూరు కేంద్రానికి రమేష్ శెట్టి, ముంబై కేంద్రానికి అమోల్ కాలేను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, అలిపిరి కాలిబాట సుందరీకరణ…
కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. థర్డ్ వేవ్‌పై రకరకాల అంచనాలున్నాయి.. అయితే.. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కారణంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతమగానే నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ.. ఈ విషయాన్ని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఇక, మరో వారంరోజులలో ఆన్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభిస్తామన్న ఆయన.. మరోవైపు.. అన్నమయ్య కీర్తనలకు బహుళ ప్రచారం కల్పిస్తాం అన్నారు.. అన్నమయ్య కీర్తనలు అన్నింటికి…
ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారిని ప్రారంభిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో ఉంది టీటీడీ.. టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని..…
టీటీడీ బోర్డు చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్… దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు.. నాకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నానన్న ఆయన.. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే.. కానీ, భవిష్యత్…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జలజగడానికి తెరదించాలన్న ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో గెజిట్ విడుదల చేసింది.. దీనిపై అభ్యంతరాలు ఓవైపు.. ఆహ్వానించడాలు మరోవైపు జరుగుతున్నాయి.. అయితే, కేంద్ర ప్రభుత్వం జలాల విషయంలో చేసిన గెజిట్ శుభపరిణామం అంటున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి…
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పాలమండలిలో చర్చించిన అంశాలు.. తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత వివరించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామన్న ఆయన.. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.. ఏపీలో…
రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో సహస్రకళషాభిషేకం భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఇక 21వ తేదికి ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనున్న విషయం తెలిసిందే. అయితే మళ్ళి టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి కే అవకాశం రానున్నట్లు తెలుస్తుంది. 22వ తేది నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. అలా 24వ తేదిన వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. అయితే చూడాలి…
ఆనందయ్య ఆయుర్వేద మందు పై కేంద్ర ఆయుష్ సంస్థ తో కలిసి టీటీడీ ఆయుర్వేదిక్ కళాశాల అధ్యయనం చేస్తోంది అని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ… ఆనందయ్య ఆయుర్వేద మందు తీసుకున్న 500 మందిని స్టడీ చేసే ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఐసీఎమ్మార్ దీనిలో చేయగలిగింది ఏమీ లేదు. కేంద్ర ఆయుష్ శాఖే నిర్ధారించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల తర్వాతే మందు విషయంలో ముందుకు వెళ్ళాలని…
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీటీడీ.. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. దీంతో.. తిరుమలలో వందేళ్ల కిందటి సంప్రదాయాన్ని శ్రీవారి ఆలయంలోపున:ప్రారంభించామన్న ఆయన.. గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేథ్యం సమర్పించాం.. అద్భుతంగా ఉందని భక్తులు ప్రశంసించారన్నారు.. లడ్డూ ప్రసాదం కూడా ఆర్గానిక్ పదార్థాలతో ప్రయోగాత్మకంగా తయారు చేయించామని.. లడ్డూ ప్రసాదం కూడా చాలా రుచికరంగా వచ్చిందన్నారు..…