ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది. ఆయన తండ్రి మేకపాటి కూడా పార్టీకి ఎనలేని సేవలు అందించారు. కాసేపట్లో సీఎం కూడా హైదరాబాద్ కు బయలుదేరతారని తెలిపారు.
ఇంత చిన్న వయస్సులో ఆయన హఠాన్మరణం నమ్మలేకుండా ఉంది. చిన్న వయస్సులో గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటు. ఇప్పడే ఈ విషయం తెలిసింది. జీర్ణించుకోవడం కూడా కష్టంగా ఉంది. సీఎంతో మాట్లాడి అందరం హైదరాబాద్ వెళతాం. వీలును బట్టి రోడ్డు మార్గాన అయినా వెళతాం అన్నారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు మంత్రి చెల్లుబోయిన. ఇవాళ జరగాల్సిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ల సమీక్ష సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మంచి మిత్రుడిని కోల్పోయానన్నారు. చాలా చిన్న వయసులో ఆయన మరణం చాలా బాధాకరం.నిన్నటివరకు అందరితో కలిసిమెలిసి ఉన్న మేకపాటి గౌతంరెడ్డి ఇక లేరనే వార్త కలచి వేసింది.మేకపాటి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటు.గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడీ ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబ సభ్యలకు నా ప్రగాఢ సానభూతిని తెలుపుతున్నాను. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అన్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్,