Tirumala laddu controversy: తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తోంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని సుప్రీం కోర్టులో నేను పిటీషన్ దాఖలు చేశాను.. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి.
YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. విచారణ సరిగ్గా జరిగితే ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమే అన్నారు.
YV Subba Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నివాసం నుండి వెనుదిరిగారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్‌ను సుబ్బారెడ్డికి చదివి వినిపించినట్లు సమాచారం. విచారణలో భాగంగా, సిట్ అధికారులు సుబ్బారెడ్డి నివాసంలో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, వాటిని తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు.…
YV Subba Reddy: రైతుల పక్షాన పోరాడి యూరియా కష్టాలు తీర్చటానికి కృషి చేశామని వైవి.సుబ్బారెడ్డి అన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో వైవి.సుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మా దృష్టిలో ఉన్నాం.. ఎవరు కేసులకు భయపడాల్సిన పని లేదు.. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. డయేరియా బాధితులను అలాగే…
2024 ఎన్నికల్లో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఎన్నికల నిర్వహణపై ఈసీ పునరాలోచించాలన్నారు. సాయంత్రం 6 తర్వాత ఏపీలోని ఎన్నో నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగిందని, నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 7 తర్వాతే పోలయ్యాయన్నారు. సాయంత్రం 6 తర్వాత పెరిగిన ఓట్లపై ఈసీని విచారణ అడిగాం అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈవీఎంలపై…
వైసీపీ నేతలు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కూటమి ప్రభుత్వంపెట్టినవన్నీ అక్రమ కేసులే అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, తప్పకుండా అన్నీ కేసుల నుంచి ఏమీ లేకుండా బయటకు వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేస్తున్నాం అని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మార్జ్…
సాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కోటరీ ఉందా..? లేదా..? అసలు కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా..? అని నిలదీశారు.. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు అని స్పష్టం చేశారు.
YV Subba Reddy: యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు.. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం..
YV Subba Reddy: బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో రాష్టానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించాలని దృష్టి సారించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. షుగర్ డౌన్ కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్. హుటాహుటిన డాక్టర్ల పర్యవేక్షణలో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు..