ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారట.. ఈ నెల 25వ తేదీన భీమిలిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు వైసీపీ రెడీ అవుతోంది.
సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత కారణాలు వారికున్నాయన్నారు వైవీ.. సీట్ల మార్పు విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారన్న ఆయన.. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు ఉండవని ముందు నుంచి సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారని గుర్తు చేశారు. సీట్లు ఇవ్వని వారు కొత్తవాళ్లతో అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది.. కానీ, అన్నీ సర్దుబాటు అవుతాయన్నారు.
ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలన వైసీపీ బలం అన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి వైఎస్ జగన్‌ను సీఎంని చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జగన్ తరపున తాను వైఎస్ షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రచారం జరుగుతోంది అని అన్నారు. తాను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదని తెలిపారు. తాను మామూలుగానే అప్పుడప్పుడు విజయమ్మను కలసి కుటుంబ విషయాలపై మాట్లాడతానని చెప్పారు. నెల రోజుల తర్వాత ఆదివారం విజయమ్మను హైదరాబాద్ లో కలిశానన్నారు. కొద్దిసేపు కుటుంబ విషయాలపై విజయమ్మ, తాను మాట్లాడుకున్నామని వైవీ సుబ్బారెడ్డి…
మేం 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం.. దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.. అయితే, వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలన్నారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం.. కానీ, ఆయన పార్టీని వీడారు.. అయితే, పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమీ ఇబ్బంది లేదు.. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి…
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో చాలా మార్పులు ఉండబోతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైవీ సుబ్బారెడ్డి.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిపించుకోవాలన్నదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితుల దృష్ట్యా మార్పులు, చేర్పులు చేస్తున్నాం.. గాజువాక నియోజకవర్గంలో కూడా సమన్వయకర్తని మార్పు చేయాలని పార్టీ ఆదేశించింది అన్నారు.
గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైవీ సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డి.. హైకమాండ్ నిర్ణయం వెనుక కారణాలు వారికి చెప్పి బుజ్జగించారు వైవీ. దీంతో, రాజీనామా విషయంలో దేవన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అసలు తాను రాజీనామా చేయలేదని అంటున్నాడు.. ఇక, నేను గాని, నా కుమారులు గానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులం.. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా…
జనసేనలాగ మాది పావలా బేడా పార్టీ కాదు అని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నాడు.. అసలు రాష్ట్రంలో ఉంటేనే కదా పగలు ఏం జరుగుతుందో చూస్తే రాత్రికి కలలు కానొచ్చు.