Gajuwaka YSRCP: గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైవీ సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డి.. హైకమాండ్ నిర్ణయం వెనుక కారణాలు వారికి చెప్పి బుజ్జగించారు వైవీ. దీంతో, రాజీనామా విషయంలో దేవన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అసలు తాను రాజీనామా చేయలేదని అంటున్నాడు.. ఇక, నేను గాని, నా కుమారులు గానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులం.. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటామని ప్రకటించారు ఎమ్మెల్యే నాగిరెడ్డి.
Read Also: Salaar Song: ఈరోజే తుఫాన్ అనౌన్స్మెంట్… రెడీగా ఉండండి
ఈ రోజు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డిని కలిశారు గాజువాక ఎమ్మెల్యే శ్రీ తిప్పల నాగిరెడ్డి, గాజువాక ఇంఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు మాట్లాడుతూ నేను గాని, నా కుమారులు కానీ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకస్తులుగా ఉంటాం. పార్టీ కి విధేయులుగా ఉంటాం. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటాం. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, అదే మాకు ముఖ్యం అన్నారు అని వెల్లడించారు.. ఇక, దేవన్ రెడ్డి మాట్లాడుతూ నిన్న నేను నా వ్యక్తిగత పనులు మీద బయటకి వెళ్లాను, వెళ్లేముందు మా ఇంచార్జి సుబ్బారెడ్డితో మాట్లాడి వెళ్లాను, అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు. నిన్న నేను మళ్లీ సిటీకి వచ్చే లోపు నామీద చాలా పుకార్లు లేపారు. అయినా మా నాన్న ఎమ్మెల్యేగా ఉండగా నేనెందుకు పార్టీకి రాజీనామా చేస్తాను? నేను పార్టీతోనే వున్నాను అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చెప్పి మా పెద్దలు సుబ్బారెడ్డి వివరణ ఇచ్చేందుకే నేను, మా నాన్న వచ్చాం. మేం ఎప్పటికి ముఖ్యమంత్రి జగన్ మాటకి, పార్టీకి కట్టుబడి ఉంటాం. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని పేర్కొన్నారు దేవన్ రెడ్డి.
Read Also: Himachal Pradesh: నేడు మంత్రి వర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణం చేయనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు
కాగా, 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్‌లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. ఇక, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి వయసు రీత్యా యాక్టివ్‌గా లేకపోవడంతో.. ఆయన కుమారుడు దేవన్ రెడ్డికి గతంలోనే నియోజవర్గ బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ దేవన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేకపోవడంతో.. వరికూటి రామచంద్రావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్ జగన్.. దీంతో, నియోజకవర్గ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేసినట్టు ముందుగా వార్తలు వచ్చినా.. ఈ రోజు రాజీనామా చేయలేదు.. మా ప్రయాణం సీఎం వైఎస్ జగన్ వెంటే అని ప్రకటించారు.