YV Subba Reddy: ఎన్నికల్లో పోటీ.. మార్పులు, చేర్పులపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV Subba Reddy: ఎన్నికలకు అంతా సిద్ధం అవుతున్నారు.. నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను అని కొందరైతే.. అధిష్టానం ఏది చెబితే అదే చేస్తాను అని మరికొందరు నేతలు ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పాను అన్నారు. పోటీ చేసేవాడ్ని అయితే 2019లోనే పోటీ చేసుండేవాడ్ని.. కంటిన్యూ అయ్యేవాడ్ని.. ప్రత్యక్ష రాజకీయాలు గ్యాప్ రావటంతో పార్టీ పనులు చూస్తున్నా.. పక్కన ఉన్నా కాబట్టి పార్లమెంటుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పాను అన్నారు. అయితే, పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయానికి శిరసావహిస్తానని స్పష్టం చేశారు.
Also Read
సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత కారణాలు వారికున్నాయన్నారు వైవీ.. సీట్ల మార్పు విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారన్న ఆయన.. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు ఉండవని ముందు నుంచి సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారని గుర్తు చేశారు. సీట్లు ఇవ్వని వారు కొత్తవాళ్లతో అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది.. కానీ, అన్నీ సర్దుబాటు అవుతాయన్నారు. అల్టిమేట్ గా ట్రాక్ రికార్డును బట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఫైనల్ అవుతాయన్నారు. కొత్త మార్పులు, చేర్పులకు సంభందించి పండుగ తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది.. సీటు రానివారికి అసంతృప్తులు ఉంటాయి.. వారికి నచ్చచెప్పి బుజ్జగింపులు చేస్తున్నాం అన్నారు.
Read Also: Mayawati Birthday: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..
దేశంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్ జగనే అన్నారు సుబ్బారెడ్డి.. పార్టీ ఆఫీసుల్లో కూర్చుని బీసీలకు ఏం చేయలేదనే విమర్శలు చేయటం సరికాదని హితవుపలికారు. ఇక, వైఎస్ షర్మిల కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల మాకొచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేది ఏమీలేదన్నారు. మా వల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే మాకు ఓటెయ్యండని సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు.. అంత ధైర్యంగా చెప్పే సీఎం దేశంలో ఎవరూ లేరన్నారు. మరోవైపు.. ఈ మధ్య వైఎస్ మరణం వ్యాఖ్యలపై ఈ మధ్య జరుగుతోన్న వివాదంపై స్పందిస్తూ.. వైఎస్ మరణంపై గతం నుంచి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?