ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుందని తెలిపారు.. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్న ఆయన.. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు.. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలపెడతా.. అక్రమ కేసులు పెట్టిన వారిపై…
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్…
Minister Savitha: కడప జిల్లాలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఎక్కడికెళ్లినా సమస్యలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. రివ్యూ సమావేశంలో భూ సమస్యలపై ఎక్కువగా చర్చ జరిగింది.. గతంలో పులివెందులకు నీళ్లు లేని పరిస్థితి ఉండేది.. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన నీటి ప్రాజెక్టుల పనులు ఇప్పుడు చేపడుతున్నాం.
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు.. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు..
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి.. అయితే, కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు..
కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీరు ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఒకప్పుడు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ... ఇప్పుడు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకే పరిమితమైంది. ఆలూరులో విరూపాక్షి, మంత్రాలయం నుంచి బాలనాగి రెడ్డి మాత్రమే గెలిచారు.
హిందూపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఎట్టకేలకు మున్సిపల్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మొన్నటి వరకు మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న వైసీపీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలంతా తెలుగుదేశం పార్టీ, బీజేపీలో చేరగా.. తాజాగా మున్సిపాలిటీలు కూడా టీడీపీ పరమవుతున్నాయి
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఇవాళ కూడా ఎన్నికల ప్రక్రియ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్
Bhumana Karunakar: తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మా పార్టీ విజయం సాధించేది కాబట్టి, కూటమి గెలిచే పరిస్థితి లేదని భావించి, ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతున్నాం అని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, టీడీపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల అధికారి టీడీపీ అనుకూలంగా పనిచేశారని చెప్పిన ఆయన,…