YS Jagan Districts Tour: జగన్ జిల్లాల పర్యటన మరింత ఆలస్యం..! అసలు టార్గెట్ అదేనా..?
- సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల పర్యటన ఉంటుందన్న జగన్..
- తాజాగా తొందరేముందని వ్యాఖ్య..
- అన్ని జిల్లాల సమీక్ష సమావేశాలు పూర్తి చేసిన తర్వాతే పర్యటన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Districts Tour: సంక్రాంతి పండుగ తర్వాత వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని సమాచారాన్ని ఇచ్చారు.. కానీ, జగన్ జిల్లాల పర్యటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చేలా ఉంది.. జిల్లాల టూర్ పై ఆయన ఇంకా ఓ స్పష్టతకు రాకపోవటమే అందుకు కారణంగా కనిపిస్తోంది.. మరి కొన్ని జిల్లాల సమీక్ష సమావేశాలు పెండింగ్ లో ఉండటంతో అవి పూర్తయిన తర్వాత ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.. దీనికి తోడు ప్రభుత్వానికి మరికొన్ని రోజులు టైం ఇస్తే మరికొన్ని వైఫల్యాలు బయటపడతాయి.. పనిలో పనిగా ప్రభుత్వాన్ని మరింత ఎండగట్టవచ్చని ఆయన భావిస్తుండవచ్చన్న రాజకీయ విశ్లేషకులు లెక్కలు కూడా వేస్తున్నారు.
Read Also: WhatsApp: త్వరలో వాట్సాప్ ద్వారా నీరు, విద్యుత్, గ్యాస్ బిల్లులు చెల్లింపులు..
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకాపోవటంపై ప్రతీ ఇంట్లో ఇదే విషయం మీద చర్చ సాగుతోందని జగన్.. పార్టీ నేతలతో ఇటీవల పలుసార్లు చెప్పుకొచ్చారు.. ఐదేళ్ల పాటు వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను టీడీపీ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అమలు చేయని తీరుని జనాలు సరిపోల్చుకుని కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుకుంటున్నారని ఆయన విశ్లేషించారు. అందువల్ల జనంలోకి వెళ్ళేందుకు ఇదే సరైన భావించారు.. సంక్రాంతి తరువాత తాను జనంలోకి వస్తానని ప్రకటించారాయన.. ప్రతీ బుధ, గురువారాలలో రెండు రోజుల పాటు జిల్లాలలోనే ఉంటానని అక్కడే బస చేస్తానన్నారు జగన్.. కార్యకర్తలతో మమేకం అవుతానని తనకు అన్ని విషయాలు వారు నేరుగా కలసి చెప్పుకోవచ్చన్నారు.. పార్లమెంట్ యూనిట్ గా చేసుకుని ఈ జిల్లాల పర్యటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.. ఇక డేట్.. జిల్లా.. ముహూర్తం అన్నీ తొందరలోనే ఖరారు చేస్తారని భావించారు ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమం నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం..
Read Also: Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు.. ట్రై చేయండి..!
అయితే, తాజాగా వైఎస్ జగన్ మాట్లాడిన మాటలు ఆ పర్యటన మరికొంత కాలం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.. ఇప్పటికే ఆయన ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రాయలసీమలో మూడు, ఉత్తరాంధ్రలో ఓ రెండు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు.. ఈ నేపథ్యంలోనే మిగతా పెండింగ్ లో ఉన్న జిల్లాల సమీక్షలు పూర్తి చేసిన అనంతరం జిల్లాల పర్యటనలకు వెళ్తే బాగుంటుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.. ఈలోగా ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చినట్లుగా అవుతుంది.. అప్పుడు మరికొన్ని ప్రభుత్వ వైఫల్యాలపై మరింత ఎండగట్ట వచ్చని భావిస్తున్నట్లు సమాచారం.. అందుకే మరికొంత కాలం వేచి చూద్దామనే ధోరణిలోనే తాజాగా మాట్లాడి ఉండవచ్చని భావిస్తున్నారట.. మరి జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు మొదలవుతుందనేది చూడాలి..
తాజావార్తలు
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!