ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై BACలో నిర్ణయం తీసుకుంటారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు కాటకాలు వస్తాయని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా తగ్గిపోతాయి.. ఇప్పుడు మిర్చి ధర పతనం అయ్యిందన్నారు. పెట్టుబడి పెరిగిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది అని అధికారులు ముందే చెప్పారు.. అయినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్.. మిర్చి రైతుల ఆవేదన తెలుసుకోవడానికి వస్తే గానీ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్య గుర్తుకు…
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు.. రేపు అసెంబ్లీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.. అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది..
వైయస్ కుటుంబానికి కంచుకోట కడప. ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్లో ఆ కుటుంబం చెప్పిందే వేదం. వాళ్ళ అనుయాయులే అక్కడ కార్పొరేటర్లు. ఇప్పటివరకు మూడు సార్లు ఇక్కడ ఎన్నికలు జరగ్గా.. వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పినవాళ్లే.. మేయర్స్ అయ్యారు. అందులో రెండు విడతల నుంచి కొనసాగుతున్నారు కొత్తమద్ది సురేష్ బాబు. ఇలాంటి పరిస్థితుల్లో... పాతికేళ్ళ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డప్పగారి మాధవి...
కూటమి ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.. అనధికారికంగా కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలఫోన్ నంబర్స్ కలెక్ట్ చేస్తున్నారని విమర్శించారు.. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ నేతలు, కార్యకర్తల ఫోన్ నంబర్స్ ఇటీవల కలెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. ట్యాప్ చేస్తున్నారనే టీడీపీ లీడర్స్ ని కావాలని ఇంకా ఎక్కువ తిడుతున్నరట్టు చెప్పుకొచ్చారు..
వైఎస్ జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరని తెలిపారు.. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో... జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు..
చంద్రబాబు తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది. కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టుగా యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు అని విమర్శించారు జగన్.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత పార్టీలో కొత్త చర్చ మొదలైందట. మరి కొందరు కీలక నేతల అరెస్టులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. వంశీ వ్యవహారం ఓవైపు నడుస్తుండగానే ఇక తర్వాతి నంబర్స్ కొడాలి నాని, పేర్ని నానిలవేనంటూ.. టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై ప్రతిపక్షంలో హాట్ హాట్ చర్చ జరుగుతున్నట్టు సమాచారం. దీంతో టీడీపీ నెక్స్ట్ టార్గెట్ ఇద్దరు నానీలే అన్న ప్రచారం పెరుగుతోంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లో ఉందని.. ఇలాంటప్పుడు ఎక్కడికీ అనుమతి లేకుండా వెళ్లకూడదు.. కానీ, ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తూ జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని మండిపడ్డారు..