ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తోంది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు ఎన్నికలు జరుగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ 14 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే వైసీపీ అభ్యర్థులు…
ఏపీలోని 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. కమలాపురం మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో 15 వైసీపీ, 5 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 01, 06, 12, 13, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. Also Read:బద్దలైన చంద్రబాబు కంచుకోట.. కుప్పంలో వైసీపీ దూకుడు.. 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 14,15,…
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకన్న కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడ్డారు. Also Read: వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఇదే కాకుండా పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు…
ఏపీలోని నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లోని మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా అందరి దృష్టి కుప్పం మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లలోని ఓట్లను లెక్కించి అనంతరం ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనున్నారు అధికారులు. అయితే ప్రారంభంలో తూర్పుగోదావరి జిల్లా ఆకివీడు పోస్టల్ బ్యాలెట్ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆకివీడు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసే సరికి ఒక్క ఓటు కూడా పడకపోవడంతో అధికారులంతా అవాకయ్యారు. ఇదిలా ఉంటే మిగితా…
ఏపీలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ ఈఓగా జవహర్ రెడ్డికి అదనపు భాద్యతలు అప్పగించారు. వీరితో పాటు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా శ్యామల రావు, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ సీఎస్‌గా జి. సాయి ప్రసాద్, ఆర్థికశాఖ కార్యదర్శి(కమర్షియల్ టాక్స్)గా ముఖేష్ కుమార్ మీనా ను బదిలీ చేశారు. అంతేకాకుండా పాఠశాల…
ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కుప్పం పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా అందరి దృష్టి ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటైన కుప్పంలో ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని నిర్ణయించుకుంది. కుప్పంను వదులుకునే ప్రసక్తి లేదని టీడీపీ నేతలు సైతం భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది… షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే రేపు (బుధవారం) రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించింది ప్రభుత్వం.. కానీ, ఆ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ నెల 18న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో.. అసెంబ్లీ ప్రారంభం కంటే ముందే.. కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్సులు అసెంబ్లీ ఆమోదానికి రానున్నాయి.…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్ పెట్టింది సర్కార్.. అసెంబ్లీ ఆమోదానికి కీలక ఆర్డినెన్సులు తీసుకురానున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ప్రభుత్వం.. ఒకే రోజున 14 ఆర్డినెన్సులను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.. ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌లు: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌ల…
గంజాయి వ్యవహారంపై గత కొంతకాలంగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉంది.. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు… పలు ప్రాంతాల్లో గంజాయి పట్టుబట్టడం.. అవి ఏపీకి లింక్‌లు ఉన్నాయనే వార్తలతో ప్రత్యేకంగా గంజాయి నివారణ చర్యలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి.. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ఎస్ఈబీ, పోలీసు శాఖ కలిసి ఇప్పటి వరకు 2,228 ఎకరాల్లో గంజాయి పంటను…
ఏపీలో పురపోరు ముగిసింది. నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 36 సర్పంచ్‌లకు, 68 పంచాయతీ వార్డు మెంబర్ స్థానాలకు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం కౌంటింగ్ కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పుల్లయ్యగూడెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విశాఖపట్నం కొయ్యూరు మండలం బాలవరం సర్పంచ్ గా…