మంచు మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటీవల కాలంలో రాజకీయాల్లో వైసీపీకి మద్దతిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా మోహన్‌బాబు వైసీపీకి మద్దతిచ్చారు. పలు మార్లు సీఎం జగన్‌ను కూడా కలిశారు. అయితే తాజాగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ కేసు సందర్భంగా తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ మనిషిని అంటూ ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని…
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నటుడు పృథ్వీరాజ్.. మొదట్లో మంచి రోజులు చూశారు కానీ, ఆ తర్వాత అనూహ్యంగా ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నారు. ఒకానొక సమయంలో.. అటు రాజకీయంగానూ, ఇటు సినిమాల పరంగానూ దాదాపు ఆయన కెరీర్ ముగిసిపోయిందన్న దుస్థితికి చేరుకున్నారు. అయితే.. తన తప్పుల్ని తెలుసుకున్న తర్వాత క్షమాపణలు చెప్పిన ఈయన ఇప్పుడు తిరిగి పుంజుకున్నారు. మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన పృథ్వీరాజ్.. ఓవైపు అవకాశాలు అందిపుచ్చుకుంటూ, మరోవైపు తప్పుల్ని సరిదిద్దుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ..…
మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో చాలా తమాషా నడుస్తోందని.. తనకు, ధర్మాన కృష్ణదాస్‌కు పడదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు ఆయన గెలిచిన నరసన్నపేట తనకు ఇచ్చి శ్రీకాకుళం స్థానానికి వెళ్లాడని.. ప్రసాదరావు తమ కుటుంబానికి గౌరవం తెచ్చిన వ్యక్తి అని ప్రశంసించారు. అసలు తామిద్దరం ఎందుకు గొడవలు పడాలని ప్రశ్నించారు. పనికిమాలిన యదవలు మాట్లాడుతున్న…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 19,332 ఓట్లు పడ్డాయి. అయితే ఆత్మకూరు ఉపఎన్నికలో నైతిక విజయం తమదేనని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వీరోచిత పోరాటం చేసిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో…
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వేంకటేష్ గౌడ, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండేళ్లు వైసీపీ ప్లీనరీ జరుపుకోలేకపోయామని..జూలై…
మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి భరత్‌పై వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 83వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు విజయంపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా ఆత్మకూరులో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు. విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి…