RK Roja: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కేసు నందైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కారణమైన ఘటనకు సంబంధించిన వీడియోపై రోజా స్పందించారు. జగన్ కు వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, కక్ష్య సాధించడంలో భాగామే ఈ కేసు పెట్టారంటూ ఆమె అన్నారు. జగన్ పై కేసు పెట్టడానికి ఒక ఫేక్ వీడియోను బయటకు…
YS Jagan: ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు.
అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు వచ్చిన భారీ ప్రజా స్పందనను రావటాన్ని చూసి కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది అని వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపించింది.
Gudivada Amarnath: యోగాంధ్రను చంద్రబాబు తన పబ్లిసిటీ కోసమే చేసినట్లు కనిపించింది తప్ప.. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలను గాలికొదిలేసారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాకి వైఎస్ జగన్ వస్తున్నారని సమాచారం తెలిసినప్పుడల్లా.. ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారు అని మండిపడ్డారు. 3వ తేదీ పీటీ వారెంట్ వేసి బయటికి తీసుకెళ్లినా.. జగన్ మాత్రం జిల్లాకి రావడం ఖాయం అని తేల్చి చెప్పారు.
ఇన్సిడెంట్స్& హ్యాపెనింగ్స్ పొలిటికల్ లైఫ్ని మలుపు తిప్పుతాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు రాజకీయ ప్రయాణం కూడా అలాంటిదే. పోటీ చేయడానికి సీటే లేదనుకుంటున్న టైంలో ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించింది అధినాయకత్వం. రాజ్యసభ సభ్యుడిగా గొల్ల బాబూరావుకు మరో నాలుగేళ్ళ పదవీ కాలం వుంది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే లేవు.
ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలే ఎప్పుడూ మండుతూ ఉంటాయనుకుంటే... అందులోనూ జమ్మలమడుగుకు ఇంకా మంటెక్కువ. ఫ్యాక్షన్ పాలిటిక్స్కు కేరాఫ్ ఇది. అయితే... మొన్నటివరకు వేర్వేరు పార్టీల్లోని ప్రత్యర్థులు తలపడగా... ఇప్పుడు ఒకే పార్టీలోని నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారట. ఇద్దరు నేతల తీరేంటో అర్ధంగాక వైసీపీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సతమతం అవుతున్నట్టు సమాచారం
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న జగన్కు ప్రభుత్వం భద్రత తగ్గిస్తోందనేది వైసీపీ ఆరోపణ. గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు, తెనాలి, పొదిలి, తాజాగా సత్తెనపల్లి. ఇలా ఆయన ఏ పర్యటనకు వెళ్లినా ఆయనకు సరైన భద్రత కల్పించటం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.
వైఎస్ జగన్కు లండన్ మందులు పనిచేయడం లేదు.. కనీసం, యోగాతోనైనా ఆరోగ్యం సక్కబడుతుంది.. యోగా ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని సలహా ఇచ్చారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. రప్పా రప్పా నరకటం అనే పదాన్ని సినిమాల్లో డైలాగ్లుగా చెబుతున్న జగన్.. రౌడీయిజం, హింస ప్రేరేపించేలా నీ పరామర్శ యాత్రలు ఏంటి? అని ప్రశ్నించారు..
వైఎస్ జగన్పై మండిపడ్డారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రప్పా.. రప్పా.. నరకడానికి వైఎస్ జగన్ ఏమన్నా స్టేట్ రౌడీనా? అని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్న వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సామాన్యులు రోడ్లపై తిరుగుతారా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. జగన్ రప్పా.. రప్పా లాడిస్తాడనే ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.