Ambati Rambabu: జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలీసుల వేదింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ హాజరయ్యారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.
ఏడాది కాలంలో కూటమి ప్రజలను వంచించిందని తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రసారమధ్యమల్లో తమ నాయకుడిపై విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు..
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని భావోద్వేగంతో స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (X) వేదికగా ఓ ప్రత్యేక పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న” అంటూ వైఎస్సార్ ఫోటోను జత చేశారు. Read Also:…
Yanamala Rama Krishnudu: భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వైఎస్సార్సిపికి అనుకూలంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము సీనియర్ సంపాదకులమంటూ సమావేశంలో పాల్గొన్న మీడియా ప్రతినిధులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో వైఎస్సార్, జగన్ ప్రభుత్వాల హయాంలో మీడియా స్వేచ్ఛను తీవ్రంగా హరించినప్పుడు ఈ సోకాల్డ్ సంపాదకులు ఏమైపోయారని ప్రశ్నించారు. Read Also: Buggana Rajendranath: ప్రజలకు ఇచ్చిన…
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడు.. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలను కొనసాగిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వ పని తీరును ప్రజలే మెచ్చుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు.
Nara Lokesh: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వైసీపీ ఆరోపణలు నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీకి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు.
Taneti Vanitha: రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు.
YS Jagan: సీఎం చంద్రబాబుపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారు అని పేర్కొన్నారు. వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లాలోని పొదిలికి వెళ్తే.. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? అని ప్రశ్నించారు.
అవినీతిలో రెండవ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి.. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకి తెలుస్తుందని ఆరోపించారు.