ఈ రోజు వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నల్లపాడు పోలీసులు.. పార్టీ కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు.. ఇటీవల జగన్.. సత్తెనపల్లి పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు..
యువత పోరు పేరిట జరిగిన నిరసన కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు వైఎస్ జగన్.. 'యువత పోరు' నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి అభినందనలు తెలుపుతూనే.. కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డారు.. 'చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు “యువత పోరు’’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్లు…
కూటమి ప్రభుత్వం ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. కూటమి ప్రభుత్వ పాలనపై వారికి వారే డబ్బాలు కొట్టుకుంటున్నారు.. ఈ కూటమి సమావేశంలో ఈ సంవత్సర కాలం పాలన, రానున్న రోజుల్లో ఏం చేస్తారో చెప్తారని అందరూ ఊహించారు. కానీ, సొంత డబ్బా కొట్టుకోవడం, జగన్ ని తిట్టటానికే సమావేశం జరిపారని దుయ్యబట్టారు.. చంద్రబాబు 420 అబద్దాలు చెప్పగా, లోకేష్ 840 అబద్దాలు చెప్పారు... కానీ, పవన్ కల్యాణ్ కళ్లు మూసుకొని కూర్చున్నారని…
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సాక మణికుమారి, సాక ప్రసన్నకుమార్ (జెడ్పీ మాజీ ప్రతిపక్షనేత).. తమ మనవడు చిన్నారి ఆద్విక్‌కు అన్నప్రాసన చేయాలని.. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కోరారు మణికుమారి దంపతులు, ఆద్విక్ తల్లిదండ్రులు డాక్టర్ శృతి, ప్రేమ్‌కుమార్.. దీంతో, చిన్నారి ఆద్విక్‌ను ఎత్తుకుని.. ముద్దాడి అన్నప్రాసన చేశారు వైఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు ఇచ్చింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది సిట్
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో పోలీస్ వైఫల్యం కనిపించడమే కాకుండా ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అర్ధమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయి, దిక్కుమాలినిది అయిపోయింది... ఈ స్థాయి కంటే తగ్గి ఇక మాట్లాడలేం... జగన్ వాహనం వల్ల కాదు.. వేరే వాహనం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్పీ చెప్పిన తర్వాత మళ్లీ మాట…
ఒకడు నరికేస్తాం అంటాడు. ఇంకొకడు కోసేస్తాం అంటాడు.. ఇవన్నీ మాట్లాడితే తప్పేంటి అని జగన్ అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. ఎక్కడ యాక్సిడెంట్ అయిన ఎవరైనా ఏదో ఒక సహాయం చేస్తారు.. స్వయంగా సీఎం చంద్రబాబు దిగి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.. కానీ, జగన్ కు మానవత్వం లేదనే సంగతి క్లియర్ గా అర్ధం అవుతోందన్నారు..
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది.. ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి..
సీఎం చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ.. సవాల్ విసిరారు జగన్.. చంద్రబాబు గారు.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఛాలెంజ్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.