ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. రేపు సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇక, ఇప్పటి వరకు సీఎస్‌గా కొనసాగుతోన్న సమీర్ శర్మ.. రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.. ఇప్పటికే రెండుసార్లు పదవి పొడిగింపు పొందిన సమీర్ శర్మను వదులుకోవడానికి సిద్ధంగా లేరు సీఎం వైఎస్ జగన్.. దీంతో, 2023 నవంబర్ వరకు ఆయన పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రాన్ని మరోసారి కోరారు.. కానీ, ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన రేపు పదవీ విరమణ చేయనున్నారు సమీర్ శర్మ.. అయితే, రేపు సీఎస్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సమీర్ శర్మ కోసం కొత్త పోస్టును క్రియేట్ చేశారు సీఎం వైఎస్ జగన్.. సీఎస్ సమీర్ శర్మ సీఎంకు చీఫ్ ఎగ్జిక్యూటీవుగా నియమించారు. ఇదే సమయంలో.. రేపు రిటైర్ కానున్న విజయ్ కుమార్ సేవలను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.. స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు.
Read Also: IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్‌ల బదిలీ.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య
కాగా, 2021 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు సమీర్‌శర్మ.. వాస్తవానికి ఆయన 2021 నంబర్ 30న రిటైర్ కావాల్సి ఉన్నా.. ఏపీ ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. ఇక, 2022 మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్ శర్మ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరడం.. మళ్లీ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఆయన సీఎస్‌గా కొనసాగుతూ వచ్చారు.. కానీ, 2023 నవంబర్ వరకు ఆయన పదవీకాలం పొడిగించేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నించింది. కానీ, కేంద్రం పచ్చజెండా ఊపకపోవడం.. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న తరుణంలో పదవీ విరమణ ఖాయమైంది.. అయినా, మరో రకంగా సమీర్ శర్మ సేవలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. సీఎం వైఎస్ జగన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటీవుగా నియమించింది.