టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలకు చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఈర్ష్య, అసూయ అని మండిపడ్డారు.. చంద్రబాబు వంటి కిరాతకులు, రాక్షసులు అడ్డుపడ్డా ఇళ్ల నిర్మాణం మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. అసలు, ఒక్క లబ్ధిదారుడైనా ఇబ్బంది కలిగిందని పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు? అని నిలదీశారు.. ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతుంటే కళ్లులేని కబోది లాంటి పవన్‌కు కనబడలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి అసూయతో ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.. ఇక, గృహ నిర్మాణంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు రావాలంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. కాగా, గృహ నిర్మాణంలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ.. ప్రభుత్వం చెప్పేది ఒకటైతే.. ఫీల్డ్‌లో పరిస్థితులు మరోలా ఉన్నాయంటూ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.. జగనన్న కాలనీలు, గృహ నిర్మాణంపై జనసేన ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ చేపట్టిన విషయం విదితమే.
Read Also: Andhra Pradesh Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎన్నికల విధులకు ఇక టీచర్లు దూరం