Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కల్యాణ్ మా వాడు.. అభిమానం ఉందన్న ఆయన.. మా సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ మీద మాకు అభిమానం ఉండదా..? అని ఎదురు ప్రశ్నించారు.. అయితే, పవన్ చేష్టల వల్ల కాపుల పరువు తీస్తున్నాడనే బాధ మాకుందన్నారు.. ఇక, సీఎం.. సీఎం.. అంటూ పవన్ కల్యాణ్‌ను చూసి నినాదాలు చేస్తున్నవారికి ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.. మరోవైపు.. కాపులు…
Anil Kumar Yadav: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్లో మంత్రి పదవి పొందిన అనిల్ కుమార్ యాదవ్.. వైఎస్ జగన్ రెండో కేబినెట్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు.. సీఎం జగన్ ముందుగా ప్రకటించిన ప్రకారమే.. మంత్రులను మార్చేశారు.. అయితే, తనను మంత్రి పదవి నుంచి తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్…
Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండలేను అని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం పట్టణంలోని పోట్టి శ్రీరాములు మార్కేట్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధర్మాన ప్రసాద్ భూములు దోబ్బేశాడని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.. రేవిన్యూ మినిష్టర్ గా.. సెంటు భూమి ఇచ్చే అధికారం కూడా నాకు లేదు.. ఇక, రెవెన్యూ…
Yanamala: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి కొత్త రక్తం రావాలని.. దానిపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. జగన్ క్రిమినల్ కాబట్టి.. ఆయన్ను కలవడానికి ఎవరైనా భయపడతారని.. చంద్రబాబు, పవన్ కలవాలి అంటే జగన్ అనుమతి తీసుకోవాలా అని నిలదీశారు. చంద్రబాబు, పవన్ భేటీతో తాము ఓడిపోతామనే భావనలోకి సీఎం జగన్ వెళ్లారని చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్…
Vijayawada: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. రాణిగారితోట ప్రాంతంలో కార్పొరేటర్ రామిరెడ్డి, ఇతర నేతలతో కలిసి దేవినేని అవినాష్ వెళ్తుండగా పలువురు స్థానిక మహిళలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కోసం పని చేశాం, మీ వెనుక తిరిగాం, మీరు మాకేం చేశారని నిలదీశారు. కార్పొరేటర్ రామిరెడ్డి తమను పట్టించుకోవడం లేదని…
Andhra Pradesh: కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎంపీ కేశినేని నానిని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వసంత నాగేశ్వరరావు తాజాగా టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానిని కలవడం చర్చనీయాంశమైంది. ఆయన కేశినేని నాని కలిసి పలు విషయాలపై చర్చించారు. కేశినేని నాని తాత కేశినేని వెంకయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్ని…
Off The Record about Mopidevi Venkata Ramana: మోపిదేవి వెంకటరమణ. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడు. 2019 ఎన్నికల్లో రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మోపిదేవిని సీఎం జగన్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. శాసనమండలిని రద్దు చేయాలనే జగన్ ఆలోచనలతో ఎమ్మెల్సీ, మంత్రి పదవి పోయాయి. అయినా రాజ్యసభకు ఎంపీగా పంపారు. వరుసగా దెబ్బతిన్నా ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ రేపల్లెలో వైసీపీ జెండా…
Off The Record about Anil Kumar Yadav: కార్పొరేటర్‌గా రాజకీయ జీవితం మొదలుపెట్టి రెండుసార్లు ఎమ్మెల్యే, మూడేళ్లపాటు మంత్రిగా పనిచేశారు అనిల్ కుమార్ యాదవ్. మంత్రికాక ముందు వరకు అందరితో కలిసి ఉన్నట్టు.. అందరికీ కావాల్సినవాడు అన్నట్టుగా అనిపించుకునేలా ఉన్న అనిల్ మంత్రి అయ్యాక రూటు మార్చారట. అయినా అప్పట్లో ఆయన మీద అసమ్మతి రాలేదు. ఎప్పుడైతే ఆయన మాజీ మంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆయన చుట్టూ ఉన్నవాళ్లు రివర్స్ కావడం మొదలుపెట్టారట. సొంతం…
Minister Kakani Govardhan Reddy: చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ సమావేశంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.. ఓవైపు విమర్శలు గుప్పిస్తూనే.. కలిసి వచ్చినా చూసుకుంటామని ప్రకటిస్తున్నారు.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. ఎంత మంది ఏకమైనా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్‌రెడ్డియే అని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక, టీడీపీ, జనసేన చీఫ్‌ల భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ…
Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందిస్తోంది.. ఇప్పటికే మంత్రులు, వైసీపీ నేతలు.. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు సందిస్తున్నారు.. 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించడం ఏంటి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.. తాజాగా, ఈ ఎపిసోడ్లో మంత్రి విడదల రజినీ హాట్ కామెంట్లు చేశారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు,…