Vellampalli Srinivas: రణస్థలం వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీపై చేసిన కామెంట్లకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు.. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… పవన్ కల్యాణ్ గ్లాస్ ఎప్పుడో పగిలింది అని వ్యాఖ్యానించారు.. తన పార్టీ కార్యకర్తలను నమ్మలేని వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు.. పవన్ ఇప్పటికైనా జనసేన పార్టీ మూసేయాలని సలహా ఇచ్చారు. పార్టీ మూసివేసి తెలుగుదేశం పార్టీలో మంచి పదవి తీసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.. పార్టీ కార్యకర్తలను, అభిమానులను చంద్రబాబుకు అమ్మేస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. దమ్ము వుంటే రా.. నేను బ్రాహ్మణ వీధిలో వుంటా.. చూసుకుందాం రా.. అంటూ పవన్ కల్యాణ్‌ను సవాల్ విసిరారు వెల్లంపల్లి శ్రీనివాస్.
Read Also: Honey Rose: చక్కగా అందరికి హానీ పూసి.. సెటిల్ అయిపోయిందే
ఇక, పవన్ కల్యాణ్ ఒక టెర్రరిస్ట్.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు వెల్లంపల్లి.. పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.. కాగా, జనసేన యువశక్తి బహిరంగ సభలో అధికార పార్టీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్.. తనపై విమర్శలు చేసివారినపై ఘాటు ఆరోపణలు చేశారు.. ఇక, వైసీపీది మూడు ముక్కల ప్రభుత్వం.. వైఎస్ జగన్ మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఇక, నిన్న పవన్ సభ ముగిసినప్పటి నుంచి అధికార వైసీపీ నేతలు వరుసగా.. జనసేనాని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.