పుంగనూరు ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిడ్డి రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు.
పుంగనూరులో పోలీసులపై టీడీపీ దాడులను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. నల్ల రిబ్బన్లతో చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దగ్ధం చేశారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.
దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్కిటెక్చ్యురల్ బోర్డ్ ఏర్పాటు చేశామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు తమకు నచ్చిన విధంగా ఏదనిపిస్తే అనిపిస్తే అది మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.