Gannavaram Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.. మరోసారి గన్నవరం రాజకీయాలు తెరపైకి వచ్చాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలేలా పరిస్థితి కనిపిస్తోంది.. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి బరిలోకి దిగి.. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అయిన వల్లభనేని వంశీ చేతిలో ఓటమిపాలైన యార్లగడ్డ వెంకట్రావు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. వల్లభనేని వంశీ.. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత.. వైసీపీలో వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డగా మారిపోయింది పరిస్థితి.. ఈ రెండు గ్రూపుల మధ్య ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంది.. వైసీపీ అధిష్టానానికి కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీ పెద్దలు సముదాయించినా.. ఇది కొలిక్కిరాకుండా పోయింది..
చివరకు వైసీపీకి గుడ్‌బై చెప్పేసి.. టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు యార్లగడ్డ.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారట.. ఈ నెల 19వ తేదీన లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణ జిల్లాకి చేరుకోనుండగా.. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు యార్లగడ్డ సన్నాహాలు చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నమాట.. ప్రస్తుతం మాత్రం గన్నవరంలో వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. గన్నవరంలో కార్యకర్తలతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.. రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు.. కార్యకర్తల సమావేశం తర్వాత కీలక నిర్ణయం యార్లగడ్డ తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు.. అది రాకపోతే టీడీపీలోకి యార్లగడ్డ వెళ్తారని క్యాడర్ చెబుతున్నమాట..
మరోవైపు.. యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తారని చానళ్ళుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ వస్తోంది.. వైసీపీలో ఉండాలా, పార్టీ మారాలా అనే అంశంపై కార్యకర్తల భేటీలో యార్లగడ్డ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.. అయితే, నేను గన్నవరం రాజకీయాల్లోనే ఉంటా.. ఇక్కడి నుంచే పోటీ చేస్తా.. ఏ పార్టీ అన్నది కాలమే నిర్ణయిస్తుంది అంటూ ఓ సందర్భంలో యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ సారి వల్లభనేని వంశీకే వైసీపీ టికెట్ దక్కే అవకాశం ఉండడంతో.. మరోసారి తన అదృష్ట్యాన్ని గన్నవరం నుంచే పరీక్షించుకోవాలన్న పట్టుదలతో ఉన్న యార్లగడ్డ.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి మరోసారి బరిలోకి దిగే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.