టీడీపీ అధినేత చంద్రబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. తనకు యాభై కోట్ల రూపాయలు ఇస్తే చాలు ఆస్తులన్నీ రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు రాయలసీమ వ్యతిరేకి అని, ఆయన రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని వైసీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే చంద్రబాబు వ్యతిరేకించారన్నారు.
బ్రో సినిమాలో నన్ను గిల్లారు.. అందుకే నేను సినిమా గురించి మాట్లాడుతున్నానని తెలిపారు అంబటి రాంబాబు. నా పేరుతో సినిమాలో క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారని పవన్‌పై ఫైర్ అయ్యారు. బ్రో చచ్చిన సినిమా అంటూ మండిపడ్డారు. ఇక, బ్రో సినిమాకి నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు.. ? నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి..? అంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.
అటవీప్రాంతంలో నివసించే ప్రజలను కూడా సమాన భాగస్వాములను చేసినప్పుడే అడవుల పరిరక్షణ పటిష్టంగా జరుగుతుందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమూహాలు, ప్రభుత్వం ఉమ్మడి కృషి ఒక్కటే అడవుల పరిరక్షణకు ఏకైక పరిష్కారం అని ఆయన అన్నారు.
చంద్రబాబు రాయలసీమ పర్యటనపై రైతులు ఆందోళన చెందుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు వస్తే వర్షాలు రావన్న భయం రైతుల్లో ఉందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని ఆయన విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాను ఏం చేసినా భాజాభజంత్రీలు కొట్టే మీడియా ఉందన్న ధైర్యం చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.