పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ ని అంగడిలో సరుకు అనడంతో జనసైనికులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము వ్యతిరేకమని, ఎందుకు వ్యతిరేకమో ఇప్పటికీ పార్టీ చెప్పిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ స్టాండ్ ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు.
పేద, బడుగు వర్గాల వారి ముఖ్యమంత్రి జగన్ అహ్నరిశలు కృషి చేస్తున్నారని, దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ జగన్పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు.
చంద్రబాబు రోజూ గంట సేపు ఉపన్యాసం ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఉన్నారని.. జగన్ రాయలసీమ ద్రోహి అని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారంలో నుంచి దింపకపోతే రాయలసీమను రత్నాల సీమగా మార్చేవాడట చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.