విశాఖలోని జగదాంబ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సీఎం జగన్ రాజ్యాంగ విరుద్ధంగా జగన్ పనులు చేయిస్తున్నాడని విమర్శించారు. సింహద్రి సాక్షిగా చెప్తున్నాను.. వాలంటర్లు మీద ద్వేషము లేదన్నారు. వాలంటీర్లతో జగన్ తప్పులు చేయిస్తున్నాడని తెలిపారు.
అంగళ్ళులో తనపైన హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఆరోపణ చేస్తున్నారని, సీబీఐ విచారణకు సిద్ధం అంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
వారాహి యాత్రకు వస్తున్న పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారాహి వెబ్ సిరీస్ 3 అంటూ వ్యాఖ్యానించారు మంత్రి. ఉత్తరాంధ్రలో అక్రమాలు అన్యాయాలపై ప్రశ్నిస్తానంటున్న ప్యాకేజ్ స్టార్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అవిశ్వాస తీర్మానం చర్చలో వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. మణిపూర్‌లో మహిళపై అత్యాచార ఘటనలు బాధాకరమని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పోలవరం అంతా పరిశీలించారని, సెల్ఫీ కూడా తీసుకున్నట్లు ఉన్నారని ఆయన తెలిపారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి పేరుతో.. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు 26 జిల్లాల్లో సీపీఐ ఐస్సుయాత్ర చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.