తన పర్యటన సందర్భంగా నెల్లూరులో 2 వేల మంది పోలీసులు తిష్ట వేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వాళ్లంతా తన సెక్యూరిటీ కోసం కాదని, తన కోసం వచ్చే జనాల్ని అడ్డుకోవటానికిని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని, జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అడుగులకు పోలీసులు మడుగులు ఒత్తుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు తమ పార్టీ వారిని కలవటం నేరమా?,…
నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుండగా.. హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు.. నల్లపురెడ్డి కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. కార్యకర్తలు దూసుకురాగా.. వైసీపీ కార్యకర్తల మీద లాఠిఛార్జ్ చేశారు పోలీసులు.. దీంతో, రోడ్డుమీద బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..
వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కాసేపట్లో ప్రారంభంకానుంది. జనసమీకరణ చేయొద్దని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కొనసాగనుంది. తాడేపల్లిలోని నివాసం నుంచి నెల్లూరు చేరుకుంటారు జగన్. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శిస్తారు. తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తారు జగన్. కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు యూరియా కొరత ఏర్పడిందని.. ఏపీకి 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినా రైతులకు యూరియా అందడం లేదని.. యూరియా అనేక చోట్ల దాచిపెడుతున్నారు అని ఆరోపించారు.
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా... హైకోర్టులో క్వాష్ పిటిషన్…
త్వరలోనే పార్టీ తరఫున యాప్ విడుదలచేస్తాం.. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే ఆ యాప్‌లో నమోదు చేయవచ్చు అన్నారు.. పలానా వ్యక్తి, పలానా అధికారి.. వారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు.. ఆధారాలు కూడా ఆ యాప్‌లో పెట్టొచ్చు.. ఆ ఆధారాలన్నీ కూడా అప్లోడ్ చేయొచ్చు.. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తోందన్నారు.. అయితే, ఆ ఫిర్యాదులపై మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా పరిశీలన చేస్తాం అని వెల్లడించారు.
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటనపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ పర్యటన అని ఆరోపించారు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు.. అంతా దోచుకుంటున్నారని మండిపడ్డారు..
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉదయం 10.30 గంటలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో భేటీకానున్నారు.. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో చర్చించనున్న వైఎస్ జగన్..
YSRCP Chandrasekhar Reddy on AP DSPs Death: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర డ్యూటీ చేసిన కానిస్టేబుల్ని వెంటనే డ్రైవర్‌గా హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు నాయుడు డ్యూటీకి ఎలా పంపించారు అని వైసీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. తాను బాగా అలసిపోయానని, డ్యూటీ చేయలేనని చెప్పినా బలవంతంగా పంపించారని మండిపడ్డారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం చెందారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనలు సాఫీగా సాగితే…