Pulivendula ZPTC By Elections: కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి.. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు అన్ని ఏకగ్రీవమే.. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసిన అక్కడ ఏకగ్రీవమే.. అయితే, 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్ల గాను 2,500 ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీగా గెలుపొందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విత్ డ్రా సమయం అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఎన్నికలు నామమాత్రం అయ్యాయి… అయితే అభ్యర్థి బరిలో లేకున్నా 2016 పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో 2750 ఓట్లు సాధించింది టీడీపీ.. 1995, 2001, 2006 సంవత్సరాలలో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ జడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..
Read Also: Investment Tips: కోటీశ్వరులు కావాలంటే.. నెలకు రూ. 5000 SIP చాలు..!
ఇక, 2021లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.. 2021లో పులివెందుల జడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది… ఈ ఎన్నికలను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. సొంత గడ్డపై తిరిగి జెండా పాతాలని వైసీపీ భావిస్తుంటే, ఎలాగైనా వైసీపీ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని తెలుగదేశం భావిస్తుందట… పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో తమ సత్తా చాటాలని టీడీపీ హ్యుహరచనలు చేస్తోందట… ప్రస్తుతం పులివెందుల జడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లు ఉన్నాయి… అసెంబ్లీ ఎన్నికలలో పులివెందుల జడ్పీటీసీ పరిధిలో టిడిపికి 25 శాతం ఓటు బ్యాంకు ఉంది.. అంతేకాకుండా 2016 జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి 2600 ఓట్లు మాత్రమే వచ్చాయి.. ప్రస్తుతం కూడా 25 శాతం ఓటు బ్యాంకు ప్రకారం అంటే దాదాపు 2600 ఓట్లు మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి.. ఎటు చూసినా పులివెందులలో టీడీపీకి బలం లేదు అని చెప్పవచ్చు… కానీ, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని తెలుగుదేశం నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు..
Read Also: Chiranjeevi: నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు.. పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ!
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాజీ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ ఎన్నికల బరిలో నిలిపింది.. చనిపోయిన వైసీపీ నేత కుటుంబానికి అండగా ఉన్నాం అన్న భరోసా కల్పిస్తూ ఈ టికెట్ వారి కుటుంబ సభ్యులకు కేటాయించినట్లు వైసీపీ స్పష్టం చేస్తోంది… టీడీపీ పాలసీ ప్రకారం చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు బరిలో ఉంటే పోటీ పెట్టము అన్న టీడీపీ.. ఆ నియమానికి విరుద్ధంగా జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో తమ అభ్యర్థిని నిలిపింది… పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల మండలానికి చెందిన వ్యక్తులు కాకుండా సింహాద్రిపురం మండలానికి చెందిన అభ్యర్థిని ఉప ఎన్నికల బరిలో దింపింది… టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ రవి సతీమణి అభ్యర్థిగా ఉండడంతో ఇక్కడ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది… వైసీపీ సిట్టింగ్ జడ్పిటిసి స్థానాన్ని వదులుకునే ప్రసక్తి లేదని గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టిందట.. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్న వెనకడుగేసే ప్రసక్తే లేదని ప్రచారంలో దూసుకుపోతుందట… నల్లగొండ వారి పల్లె లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నేత వేల్పుల రాముపై టీడీపీ నేతలు దాడులు చేసి గాయపరిచారు.. ఈ దాడులపై అటు వైసీపీ, ఇటు టిడిపి వారి పై కేసులు కూడా నమోదు అయ్యాయట. టిడిపికి చెందిన దాదాపు 50 మంది పై హత్యాయత్నం కింద కేసు నమోదు కాగా, వైసీపీకి చెందిన 50 మంది నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారట… అయినా, తగ్గేదేలే అంటూ వైసీపీ, టీడీపీలు హోరాహోరీగా ప్రచార పరవాన్ని కొనసాగిస్తున్నాయి…
Read Also: Indian Railways: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వేశాఖ.. ఇలా చేస్తే 20 శాతం డిస్కాంట్..!
అయితే, వైసిపి అధికారం లో ఉన్నప్పుడు కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి పక్కా హ్యూహంతో టిడిపిని దెబ్బ కొట్టింది. ఇప్పుడు టిడిపి కూడా పులివెందులలో అదే ఫార్ములా అమలు చేసి వైసిపి సొంత ఇలాకాలో దెబ్బ కొట్టాలని పక్కా ప్రణాలికతో అడుగులు వేస్తున్నారట. కుప్పంలో గెలిచాం అని జబ్బలు చరిచిన వైసిపికి ఇప్పుడు పులివెందులలో టిడిపి సత్తా ఏంటో రుచి చూపించాలని బీటెక్ రవి సతీమణిని రంగంలోకి దించారని ప్రచారం సాగుతోంది. పులివెందులలో బీటెక్ రవి టిడిపి కీలక నేత కావడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. పైగా పులివెందుల మండలానికి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరిని తమ వైపు తిప్పడంలో టిడిపి సక్సెస్ అయిందట.. ఈ స్థానాన్ని టిడిపి కైవసం చేసుకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం తప్పదు అంటున్నారు. ఇదిలా ఉండగా జడ్పిటిసి స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు టిడిపి శ్రేణులను ఆదేశించారట… ఎలాగైనా సరే పులివెందుల జడ్పిటిసి స్థానాన్ని దక్కించుకొని ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయట… మరి టిడిపి ఈ ఎన్నికల్లో ఎలాంటి హ్యాహాలను అమలు చేస్తుంది. జగన్ అడ్డాలో వైసీపీ అధినేతకు షాక్ ఇస్తుందా..? లేక ఓటమిని చవిచూస్తుందా..? అనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..