నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ బస్సు యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నారు. జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి వైసీపీ నాయకులు తీసుకెళ్తున్నారు. ఇక, నేడు ప్రకాశం జిల్లా కనిగిరిలో సామాజిక సాధికారిక యాత్ర కార్యక్రమం కొనసాగనుంది.
రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానమే అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయ రంగంపై వేల కోట్ల ఖర్చు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అందరికీ సమానత్వం రావటమే సాధికారత అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ చట్టసభలలో బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ప్రాధాన్యత రావడమన్నారు.
మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని వెల్లడించారు. పేదలకు అండగా నిలబడి వారికి గుండె చప్పుడుగా ముఖ్యమంత్రి మారారన్నారు.
విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్లో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీలో త్వరలో కనుమరుగయ్యే పార్టీ జనసేన పార్టీ అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సామాజిక సాధికారిత కోసం ఎంతో మంది పోరాటాలు చేశారని మంత్రి చెప్పారు.