మరో సారి వైసీపీ గెలవాలి.. రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన కొనసాగాలి అని ఆకాక్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. పల్నాడు పర్యటనలో ఉన్న ఆయన.. మంచి చేసిన ప్రభుత్వ పని తనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.. మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.890 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. ప్రభుత్వం నుండి నేరుగా లక్ష మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. 38 అంశాల అజెండాతో సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది..
చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు ఇబ్బందేంటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ భూమ్మీద తానే అపర మేధావిని అన్నట్టు సజ్జల ఫీలవుతున్నారని ఆయన విమర్శించారు.
మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ప్రారంభించారు.
గతంలో ఎన్నికైన నాలుగేండ్ల తర్వాత పార్టీలు బయట అడుగు బయటపెట్టాలంటే భయపడేవారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.జగన్ మన గౌరవం, ఇమేజ్ పెంచారని, ప్రతి లబ్దిదారునికి మేలు జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై మండిపడ్డారు హౌసింగ్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరిపించాలని పీలా గోవింద్ ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు.
క్రీడలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొ్న్నారు. నవంబరు 1 నుంచి 2023 సబ్ జూనియర్ టోర్నమెంట్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి డిక్లేర్ చేశారు.
Gudivada Amarnath: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ఎపిసోడ్, చంద్రబాబు మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తీసుకొచ్చిన ఘటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు శేష జీవితం అంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సిందేనని జోస్యం చెప్పారు. మనవడు దేవాన్ష్ తో తాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాడని చెప్పిన నారా భువనేశ్వరి.. ఇప్పుడు మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎందుకు…