పల్నాడు జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణారావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ…. 2024లో జగనే మళ్లీ సీఎం కావాలని అన్నారు. జగన్ సీఎం అయితేనే ప్రతి పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారని తెలిపారు. జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.. గడిచిన నాలుగు ఏళ్లుగా జగన్ చేసిన మేలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నారు. సీఎం జగన్ ప్రతి పేదవాడి ఇంట్లో ఆనందం నింపారని.. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలను దోచుకున్నారని ఎంపీ ఆరోపించారు. టీడీపీలో అణగారిన కులాలపై, అణగారిన కుటుంబాలపై దాడులు జరిగేవి…. జగన్ పాలనలో వాటికి అడ్డుకట్ట వేశారని తెలిపారు.
Read Also: Diwali Holidays: బ్యాంకులకు దీపావళి సెలువులు ఎన్ని రోజులో తెలుసా..!
ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ… జగన్ పాలనలో రాజకీయంగా అణగారిన కుటుంబాలను ఆదుకున్నారన్నారు. గ్రామస్థాయి నుండి రాజ్యసభ స్థాయి వరకు బీసీ ఎస్సీలకు పెద్దపీట వేశారని ఎంపీ తెలిపారు. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను, తన పాలన రూపంలో కొనసాగిస్తున్న జగన్ ను మళ్ళీ సీఎం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో పెదకూరపాడు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. రాబోయే రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ అడ్డాగా మారాలని మోపిదేవి పేర్కొ్న్నారు.
Read Also: Sowa Fish: “ఇది చేప కాదు, బంగారం”.. ఒకే రాత్రిలో కోటీశ్వరుడైన పాక్ మత్స్యకారుడు..
సీఎం జగన్ నాయకత్వంలో పెదకూరపాడు అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ నాయకులకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయే నాయకుడు సీఎం జగన్ అని… సాధికార యాత్ర ఫలితాలు రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పారు.