పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, అలీ పాల్గొన్నారు. అందులో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాష్ట్రానికి నాలుగు దిక్కులుగా సీఎం జగన్ భావిస్తారని తెలిపారు. అలాంటి జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత అణగారిన వర్గాలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
ఆ రెండు పార్టీలు విలువలు విడిచిపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలను మభ్యపరిచి మోసగించడానికి చూస్తున్నాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన-టీడీపీలది అనైతిక పొత్తని అభివర్ణించారు. ఆంధ్రాలో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తామంటున్నాయని, తెలంగాణాకు వచ్చేసరికి జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిస్తుంటే, మరి టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తోందన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్ రావు అన్నారు. రూ.149 కోట్లతో అమరావతి - బెల్లంకొండ రోడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. గత టీడీపీ హయాంలో సదావర్తి భూములు కాజేయాలని చూసారని... అమరావతి దేవుడి సాక్షిగా ఆ భూములను కాపాడానన్నారు. అంతేకాకుండా.. అచ్చంపేట మండలం సత్తెమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేశామని.. అటవీ శాఖ అనుమతులు తెచ్చి రోడ్ వేస్తున్నామని తెలిపారు
సీఎం జగన్ పై టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలకు నమ్మకం లేదని ఆయన ఆరోపించారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని విమర్శించారు.
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం రాలేదు.. పెద్దపాడులో ఓటు అడగనన్నారు. మీకు ఇష్టం ఉంటే వేయండి... అలాగని మీ పనులు ఆపనని మంత్రి ధర్మాన తెలిపారు. నన్ను కాదని మీరు ఓటు వేస్తారా... మే వరకూ నేను ఉంటాను వేయండి చూద్దాం అని అక్కడి జనాలను ఉద్దేశించి అన్నారు.
పల్నాడు జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణారావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.... 2024లో జగనే మళ్లీ సీఎం కావాలని అన్నారు. జగన్ సీఎం అయితేనే ప్రతి పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారని తెలిపారు. జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.. గడిచిన నాలుగు ఏళ్లుగా జగన్ చేసిన మేలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నారు.
పురంధేశ్వరి.. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వచ్చిందన్నారు.. కానీ, ఇప్పుడు ఆ గౌరవం పోవడమే కాదు.. బీజేపీలోనే ఆమెకు మద్దతు లేదన్నారు. ఈ మాత్రం దానికి బీజేపీ అధ్యక్షురాలుగా ఉండటం ఎందుకు? టీడీపీలో చేరితే సరిపోతుంది కదా? అని ప్రశ్నించారు మంత్రి అప్పలరాజు.