పీలో కరువు విలయతాండవం చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు.
మరోసారి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్గా మారింది పరిస్థితి.. జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. అయితే, కలెక్టర్ రాకపోవటంతో పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గతంలో కూడా కలెక్టర్ రాక పోవటంతో ధర్నా చేస్తామని అప్పట్లో పేర్ని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చగా మారాయి.
Minister Ambati Rambabu: చచ్చేంత వరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా.. పార్టీ మారను.. మారబోను అంటూ స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు రుణ మాఫీ అని మహిళలను మోసం చేశాడు.. బంగారు రుణాలు మాఫీ అని చేతులు ఎత్తే శాడు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు.. అందుకే వై ఎపీ నీడ్స్ జగన్…
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే సీఎం జగన్ టికెట్లు కేటాయిస్తారన్న ఆయన.. ప్రజలకు చేసిన కార్యక్రమాలు చూసి మరోసారి ఆశీర్వదించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతున్నారు అన్నారు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఏ చాన్స్ వదలకుండా అన్నింటిపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు మరో సారి అధికారం దక్కించుకోవాలని, పార్టీని పరుగులు పెట్టించాలని సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ స్పష్టమైన ప్రశ్నలతో ముందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.