విశాఖపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం, అభివృద్ధికి దూరంగా ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీలను టీడీపీ కూరలో కరివేపాకులా వాడిందని ఆయన మండిపడ్డారు.
బీసీలను నిర్లక్ష్యం చేస్తూ, వారికి అన్యాయం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు వ్యాఖ్యానించారు. రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు నందిగాం సురేష్, సినీ నటుడు ఆలీ, శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషెన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు.
ఉద్యమాలతో సంబంధం లేకుండా అసైన్డ్ భూములు పేదలకు సీఎం జగన్ ఇచ్చారని మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. లంక భూములు, చుక్కల భూములు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమగ్ర కులగణన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కె.మాధవిలత అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, పూర్వపు ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న 5 జిల్లాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు హాజరయ్యారు.
చంద్రబాబు లాయర్ హైకోర్టులో మెమో ఫైల్ చేశారని.. గుండె పరిమాణం పెరిగిందని చెబుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. వాదనలలో తాను నిప్పు అంటూ స్క్వాష్ పిటిషన్ వేశారన్నారు. మానవతా దృక్పదంతోనే, ఆరోగ్య కారణాలతోనే బెయిల్ వచ్చిందన్నారు. నిజం గెలవాలని తిరిగినా ఆవిడ ఎక్కడుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు.