Ap Elections 2024: ఈ ఎన్నికలు రాష్ర్ట భవిష్యత్ కు కీలకమైనవి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవ్వడం చారిత్రక అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు కాదు అర్జునుడు.. జగన్ సైన్యంలో సైనికుడిగా పని చేస్తాను అని ఆయన వెల్లడించారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయడానికి పోటీ నుంచి తప్పు కోవడానికైన సిద్ధం అని అమర్నాథ్ చెప్పుకొచ్చారు.
Read Also: Mudragada Padmanabham: అమావాస్యే అడ్డు..! త్వరలో శుభవార్త వింటారు..
ఇక, ఆ దిశగా ఎటువంటి ఆలోచనలు కాదు కానీ తడబాటు కానీ ఉండదు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా పార్టీ విజయానికి కృషి చేస్తాను అన్నారు. 15 నియోజకవర్గాలు గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాను.. లక్షల మంది సమక్షంలో ముఖ్యమంత్రి నాకు కల్పించిన భరోసా అని ఆయన పేర్కొన్నారు. నాకు ఇచ్చిన బాధ్యతకు కృతజ్ఞతలు అని తెలిపాడు. ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని అమర్నాథ్ అన్నారు. అయితే, చాలా మంది తన పరిస్థితి ఏంటని, ఎక్కడి నుంచి పోటీ చేస్తావని అడుగుతున్నారు.. తన పనైపోయిందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను ఒకటే చెబుతున్నా.. తనకు 15 నియోజక వర్గాల బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు.. 15 నియోజక వర్గాలకు గెలిపించడమే నా ముఖ్య ఉద్దేశం అని అమర్నాథ్ పేర్కొన్నారు.