MP Midhun Reddy: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి.. మరికొందరు వైసీపీ నేతలు.. వైసీపీలో చేరాల్సిందిగా ముద్రగడను ఆహ్వానించారు.. ఇక, ముద్రగడతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ మిథున్‌రెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు ఇక్కడికి వచ్చామని.. వైసీపీలో చేరాలని ఆహ్వానించామని తెలిపారు. ముద్రగడ ఆలోచించి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నారు. అంతేకాదు.. ముద్రగడకు ఎలాంటి ఆఫర్ ఇస్తున్నారు అని అడుగుతున్నారు.. కానీ, ఆయన బేషరతుగా వైసీపీలో చేరతారని భావిస్తున్నాం అన్నారు… పెద్దలను ఎలా గౌరవించాలో సీఎం జగన్ కి తెలుసన్న ఆయన.. ముద్రగడ పద్మనాభం.. వైసీపీలో చేరడానికి ఒప్పుకున్న తర్వాత మిగతా విషయాలు చర్చిస్తామని తెలిపారు.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మిథున్‌రెడ్డి.. ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..