నెల్లూరు ( Nellore ) జిల్లాలోని కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి ( Vijaysai Reddy) పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సామాజిక వర్గానికీ జగన్ ( Jagan ) కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అని తెలిపారు. కార్పొరేషన్ పెట్టారు కానీ నిధులు ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారు.. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం కూడా ఇన్ని కార్పొరేషన్ లను పెట్టలేదు అని ఆయన గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలు.. పేదలను సమానంగా జగన్ చూస్తున్నారు.. చరిత్ర పుటల్లో సీఎం జగన్ నిలిచిపోతారు.. ఆయన సుపరిపాలన మనం పుస్తకాల్లో చదువుకుంటాం అని ఎంపీ అభ్యర్థ విజయసాయి రెడ్డి ( Vijaysai Reddy) పేర్కొన్నారు.
Read Also: Rakhi Sawant: అనంత్ అంబానీని నా దగ్గరకు పంపండి.. తృప్తి పర్చడమే కాకుండా బరువు తగ్గిస్తాను
ఇక, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ( Nallapareddy Prasanna Kumar Reddy ) మాట్లాడుతూ.. ఒకరి ద్వారా లబ్ధి.. పదవులు పొందినప్పుడు నిజాయితీగా ఉండాలి.. నెల్లూరు ( Nellore ) టౌన్ లో ఒక ముస్లిం నాయకుడికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని మరో నేత వెళ్లిపోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఉండే మైనార్టీ సోదరులకు మనవి చేస్తున్నా.. 50 ఏళ్ల చరిత్రలో నెల్లూరులో ఒక ముస్లిం వ్యక్తికి వైసీపీ టికెట్ ఇస్తే.. జగన్ ను వదిలి వెళ్ళారు.. అన్ని నియోజకవర్గాలలో ముస్లిం మైనార్టీ సోదరులు మీ సత్తా చూపించండి.. మీ బలమేందో చూపించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకు డబ్బుండొచ్చు కోటీశ్వరుడు కావచ్చు ఒక ముస్లిం.. ఎమ్మెల్యే, ఎంపీ కాకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఏమి తప్పు చేస్తే పార్టీ నుంచి వదిలి వెళ్లావు.. ఎవరి వల్ల ఆరు సంవత్సరాల రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావో గుర్తుంచుకోవాలి.. నా నియోజకవర్గంలో నేనే అతడిని ఎక్కువగా తిప్పాను అని పేర్కొన్నారు. ఈరోజు జగన్ కు నమ్మకద్రోహం చేశాడు ప్రజలు క్షమించరు.. విజయ సాయిరెడ్డి ఎంపీ అభ్యర్థి కావడం మన అదృష్టం అని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also: Rajnath Singh: “భారత్ యుద్ధానికి సిద్ధం”.. చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు..
వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు ( Beeda Masthan Rao ) మాట్లాడుతూ.. వైసీపీలో అన్ని రకాల పదవులు కుటుంబ సమేతంగా అనుభవించారు.. చివరి క్షణంలో ఇటువంటి ద్రోహం చేయటాన్ని ఎవరూ హర్షించకూడదు.. మనం సవాల్ గా తీసుకొని విజయ సాయిరెడ్డిని గెలిపించుకోవలసిన బాధ్యత ఉంది అన్నారు. బటన్ నొక్కి ఈ నాలుగు సంవత్సరాల పరిధిలో కొన్ని లక్షల కోట్ల ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కొనసాగాలి.. పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మనలో ఒకరుగా విజయసాయిరెడ్డి ఉంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యసభ సభ్యుడినని.. జగన్ కు అత్యంత సన్నితుడినే గర్వం ఏ రోజూ ఆయన ప్రదర్శించలేదన్నారు. సింహపురి సింహం విజయసాయిరెడ్డి.. విజయసాయిరెడ్డి పేరు ప్రకటించగానే వాళ్ళు నిద్రపోవడం లేదు.. పోటీ చేయాలా లేదా అనే ఆలోచనలో పడ్డారు.. ఎంత మంది కోటీశ్వరులు వచ్చినా మా వెంట్రుక కూడా పీకలేరు.. వాళ్ళ బ్రతుకులు అంతా నా చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడతాం అని ఎంపీ బీద మస్తాన్ రావు వెల్లడించారు.