అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారంపై వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు.
జూన్ 9వ తేదీన విశాఖ నుంచి రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో లేనిపోని గొడవలు సృష్టించవద్దంటూ ఆయన హితవు పలికారు.
అల్లర నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గన్మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణమని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి.. కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీస్ అబ్జర్వర్ అధికారులను, పోలీసులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాలన ఈసీ పరిధిలో ఉంది కాబట్టి.. టీడీపీ తన ఏజెంట్లను నియమించుకుంది.
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. వైసీపీ నేతలు, మంత్రులు.. ఈ బృందంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ , కావటి మనోహర్ నాయుడు తదితరులున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, దాడులు వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు