Ap High Court: పిన్నెల్లికి హైకోర్టు షాక్.. ఏం చెప్పిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ రోజున మాచర్ల వెళ్లొద్దని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు తెలిపింది. ఈవీఎం (EVM) ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6 వరకు ఉండాలంది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిన హైకోర్టు.. ఈ కేసు విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడవద్దని పిన్నెల్లి కి సూచించింది. సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని వెల్లడించింది. పిన్నెల్లి పై పూర్తి స్థాయి నిఘా విధించాలని సీఈఓ, పోలీసు అధికారులుకు హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
READ MORE: Man Kills Mother: భోజనం పెట్టలేదని తల్లిని చంపి చెట్టుకు ఉరేసిన దుర్మార్గుడు..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
కాగా..ఈవీఎం ధ్వంసం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గురువారం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు నిన్న విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా పిన్నెల్లికి మాత్ర కోర్టు షరతు విధించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..