Vallabhaneni Vamsi Mohan: మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, వంశీ హైదరాబాద్ వెళ్లిపోయారట.. గత నెలలోనే వంశీ హైదరాబాద్‌కు వెళ్లినట్టుగా చెబుతున్నారు.. తాజాగా వంశీని పట్టుకోవటం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు..
Read Also: Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా పెరిగిన వరద ఉధృతి.. 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత..
కాగా, టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన వల్లభనేని వంశీ.. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. అయితే 2019 ఎన్నికల్లో.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైర్ బ్రాండ్ స్వరం క్రమంగా మారుతూ వచ్చింది.. వైసీపీ మద్దతుదారుగా మారిపోయిన ఆయన.. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. టీడీపీపై.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు ఫ్యామిలీపై వ్యక్తిగ విమర్శలు చేయడం పెద్ద రచ్చగా మారిన విషయం విదితమే.. మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. ఈ దాడి ఘటనలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.