తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వైసీపీ రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చేయడం లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి తాను జగన్ వెంట ఉన్నానని.. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచానని ఆయన పేర్కొన్నారు.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.
ఆ ఉమ్మడి జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు పార్టీకి పట్టున్న జిల్లాలో క్రమంగా అంధకారం అలముకుంంటోందా? పక్క పార్టీల్లోకి క్యూ కట్టే నేతల సంఖ్య పెరుగుతోందా? ఇప్పటికే ఓ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పక్కకు జరగ్గా… జిల్లాలో పార్టీకి ఆయువుపట్టు లాంటి నేత కూడా బైబై చెప్పేస్తారా? ఇన్నాళ్ళు ఖండించిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు పరోక్షంగా మనసులో మాటను చెప్పకనే చెప్పారా? ఇంత జరుగుతున్నా సెట్ చేయగలిగిన ట్రబుల్ షూటర్లేని ఆ జిల్లా ఏది?…
రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై సిసోడియా నివేదికపై వచ్చే కేబినెట్లో చర్చించి లెక్కలన్నీ బయటపెడతామని, అక్రమాలకు బాధ్యులైన అందరి పైనా చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పాత విధానం అమలు చేస్తామని.. సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి సమక్షంలో ఫేజ్ రీయింబర్స్మెంట్ అమలు మీద నిర్ణయం తీసుకుంటామన్నారు.
టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ దుర్మార్గపు చర్యలు నచ్చక పోవడం కారణంగానే పలువురు నాయకులు పార్టీ వీడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. జగన్ స్వయంకృత ఫలితం కారణంగానే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది.. రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఢిల్లీలో ఈ రోజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు ఇరువురు నేతలు.. అంతేకాదు.. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అంతేకాదు.. వారి అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయి..
కొల్లం గంగిరెడ్డి వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడి.. జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటాం.. ఆ జిల్లా నాయకత్వం చర్చలు జరుపుతుందేమో చూడాలన్నారు.
ముంబై నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ అయ్యింది.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. జిత్వానీ నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని.. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజీనామాకు ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయ.. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిందని.. అధికారం లేదని పార్టీ వీడటం లేదు అని స్పష్టం చేశారు.. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో.. నాకు ఉన్న ఇబ్బందులు, సమస్యలతో వైఎస్ఆర్సీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నాను అన్నారు.