సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు.
రెడ్ బుక్ రాయడం గొప్పకాదు , రెడ్ బుక్ పేరుతో మా నేతలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నేను ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా వేధించలేదన్న ఆయన.. కానీ, ఇప్పుడు మా నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు.. మీరు చూపించిన దారిలోనే నేను నడుస్తాను అంటూ వ్యాఖ్యానించారు..
నా దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారు.. అంటూ వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏలూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల విజయవాడలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిందన్నారు.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.. ఏడాదిలో ఎంత వర్షం పడుతుందో అంత…
కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ను గుంటూరు జైలులో పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందన్నారు.. చంద్రబాబు వైఫల్యంతో వరదల వల్ల 60 మంది చనిపోయారని ఆరోపించారు.. అందుకోసమే ఎప్పుడో జరిగిన ఘటనపై టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.. అసభ్య పదజాలంతో దూషించినా.. నేను…
కృష్ణానదిలో భారీ వరలు.. విజయవాడ అతలాకుతలం అవుతోన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం సంచలనంగా మారింది.. అయితే, దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు హోం మంత్రి అనిత.. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి, అందుకు సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు..
వరద బాధితులకు వైయస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ప్రకటించారు.. తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు వైసీపీ ప్రజాప్రతినిధులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు.. నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. అందులో 100 మందికిపైగా ఉన్నారు.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.. అంటే వారిని నేను ఏదో కట్టె పట్టుకొని కొడతానని కాదు.. చంపేస్తానని కాదు.. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.