మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం సహా రెండు కేసుల్లో పిన్నెల్లికి ఏపీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరం అన్నారు.. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించ కూడదు అనే తాపత్రయం కనిపించిందని దుయ్యబట్టారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. టెక్కలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరాడ తిలక్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీచేసింది.
అచ్యుతాపురం ఘటన బాధాకరం అన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. కానీ, ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా నెపం మాపై నెట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరం అన్నారు.
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైసీపీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాం. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందన్నారు.
ఆ మాజీ ఐఎఎస్ పొలిటికల్ ప్లస్సా? మైనస్సా? సింపుల్‌గా, షార్ట్‌కట్‌లో వీలైతే ఎమ్మెల్యే... కుదిరితే మంత్రి కూడా అయిపోయి దర్పం ఒలకబోయాలనుకున్న ఆయన ముంత ఆదిలోనే ఒలికిపోయింది. అటు ఉద్యోగమూ పాయె... ఇటు పదవీ రాకపోయె. ఇప్పుడా అధికారి ఫుల్‌టైం పొలిటీషియన్ అవుతారా? ఆ నియోజకవర్గంలో వైసీపీని నిలబెట్టే సత్తా ఉందా? జీతపు రాళ్ళకు అలవాటు పడ్డ బాబు... జేబులో నుంచి డబ్బు తీసి కేడర్ కోసం ఖర్చు పెట్టగలరా? ఇంతకీ ఎవరాయన? ఏంటా కథ?
ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు. బొత్సను శాసనమండలి పక్ష నేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్ఠానం లేఖ ఇవ్వనుంది.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం.. విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతానికి మా పార్టీది మూడు రాజధానుల విధానమేనని.. మూడు రాజధానులపై మా పార్టీ విధానం మార్చాలనుకుంటే మా నాయకుడితో చర్చించుకుంటామని స్పష్టం చేశారు.