Kuppam: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీ గూటికి కుప్పం మున్సిపల్ చైర్మన్
- కుప్పంలో వైసీపీకి భారీ షాక్..
- వైసీపీకి కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ గుడ్ బై..
- సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuppam: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకంటే ముందు నుంచే రాజకీయ సమీకరణలు మారిపోయాయి.. ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు… ఇలా చాలా మంది పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరారు.. మరికొందరు జనసేన కండువా కప్పుకున్నారు.. ఇంకా కొందరు కమలం పార్టీలో చేరిపోయారు.. ఇప్పుడు చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసీపీకి గుడ్‌బై చెప్పడంతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు సుధీర్..
Read Also: Kidney Cancer Signs: ఈ లక్షణాలు ఉంటే కిడ్నీ క్యాన్సర్ కావచ్చు
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఉండవల్లి నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి సుధీర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి సుధీర్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని ఈ సందర్భంగా వెల్లడించారు సుధీర్. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా కేంద్రీకరించారు వైఎస్ జగన్.. అయితే, మరోసారి భారీ విజయాన్ని అందుకున్న చంద్రబాబు నాయుడు.. తన నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!