కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు ఈ మేరకు నోటీసులు అంటించారు పోలీసులు..
ప్రభుత్వం 'సూపర్ సిక్స్ హామీలు' కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు.
AP Legislative Council : ఏపీ శాసనమండలిలో ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదం సాగింది. ఈ సందర్భంగా, వైఎస్సార్సీపీ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు కట్టిన చర్యలతో సభను అడ్డగించాలని వారు ప్రయత్నించారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. “సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలంతో…
Sri Reddy: సినీ నటి , వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి, గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతూ, ఇప్పుడు క్షమాపణలు కోరారు. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత వంటి నేతలపై ఆమె సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చిన్నా పెద్దా అని భేదం చేయకుండా తన అభిప్రాయాలను పంచుకుంటూ, వైసీపీకి మద్దతు తెలిపింది. అయితే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె…
Nimmala Ramanaidu : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే.. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019 జనవరి 29 న 1942 కోట్లతో పాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 4819 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తే , వైసిపి కేవలం 9…
Raghu Ramakrishna Raju : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అయితే.. ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రఘురామతో పాటు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్…
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ చేతులెత్తేసినట్టేనా? ప్రభుత్వ అణచివేత అన్నది కేవలం సాకు మాత్రమేనా? అసలు సంగతి వేరే ఉందా? వామపక్షాల అభ్యర్థులు సైతం బరిలో ఉన్నా… అంతకు మించి వందల రెట్ల బలం ఉన్న వైసీపీ ఎందుకు తప్పుకుంటున్నట్టు ప్రకటించింది? ఏ విషయంలో గోదావరి జిల్లాల వైసీపీ లీడర్స్ భయపడ్డారు? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల్ని నిలపకూడదని నిర్ణయించింది వైసీపీ. అందుకు…
Minister Satya Kumar: మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మండిపడ్డారు. శాసన మండలిలో నేను నవ్వుతూ సమాధానం చెప్పానని జగన్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.. చట్ట సభల్లో నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానాలు చెప్తారా అని ప్రశ్నించారు.
AP Home Minister: అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ నేతలు ఈ కేసులపై గగ్గోలు పెడుతున్నారు.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళకు తెలుసా అని అడిగారు.