Anil Kumar Yadav: పార్టీ మారుతున్నారనే వార్తలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ!
- తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారు
- నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ
- జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా..
- మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kumar Yadav: తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయా ఛానళ్లు తమ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ ఎలా ఉంటే అలా ఉంటానని స్పష్టం చేశారు. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉన్నానని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఒకవేళ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే ఏ పార్టీ వైపు కూడా వెళ్లనన్నారు. త్వరలోనే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటానన్నారు. తనను ఏదో విధంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టాలని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
Read Also: YS Jagan: సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
దీనికోసం లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఎందరో మహామహులు జైలుకు వెళ్లారని.. జైలును చూసి భయపడనని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. జిల్లాలో శునకానందం పొందుతున్న కొందరు అధికారంలోకి వచ్చామని.. తమకు మించిన వీరులు లేరని అనుకుంటున్నారన్నారు. ఇలా అనుకున్న ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. తాను ఇంకా యువకుడినే అని, మేం మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు తడాఖా చూపిస్తామన్నారు. పల్నాడుకు వెళ్లి పోటీ చేసిన తర్వాత అక్కడ ప్రజలు ఎంతగానో ఆదరించారని చెప్పారు. ఎమ్మెల్యేల కంటే 40 వేల ఓట్లు అధికంగా తనకు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని వారిపై దాడులు చేస్తున్నారని.. తాను ఆ ప్రాంతంలో పర్యటిస్తే వారిపై దాడులు చేస్తారని అనుకుంటున్నామన్నారు. అందువల్లే దూరంగా ఉంటున్నానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమన్నారు. ఇచ్చింది డబుల్ గానే తిరిగి చెల్లిస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!