రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి నెలకొన్నాయని.. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు కాబట్టి ప్రశ్నించే స్వరం లేకుండా అణిచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా హామీల అమలు లేదని మండిపడ్డారు.
సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు.. సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయి అంటూ మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద ఇస్తాను సారంగా మాట్లాడుతున్నారు.. వారి జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో, వ్యాపార సంస్థల్లో దాడులు నిర్వహించారు ఆదాయపన్నుశాఖ అధికారులు.. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు.. ఈ రోజు కూడా ఆయనకు సంబంధించిన వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్న వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించనున్నారని సమాచారం.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో, పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. డీజీపీ రాజకీయ నేత లాగా వ్యవహరించకూడదని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్లో కీలక చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చను లేవనెత్తారు. కొంత మంది వైసీపీ నేతలు మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు.
విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని వైఎస్ జగన్ ప్రకటించారు. విజయనగరం జిల్లా నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు.
డైలీ సీరియల్లో సస్పెన్స్ సీన్ లను తలపించేలా అక్కడి రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు వైసిపి కోర్టులో ఉన్న బాల్.. టిడిపి వైపు వెళ్ళింది. ఆ తర్వాత అదే బాల్ మళ్ళీ వైసిపి కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు ఎత్తులకు పైఎత్తు వేస్తూ…టిడిపి వేసిన వ్యూహంలో వైసిపి చిక్కుకుందా…? పొలిటికల్ టూర్లను తలపించే విధంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయా ? ఎన్నికలు లేని సమయంలో క్యాంప్ రాజకీయాలు ఏంటి ? ఎన్నికలు లేవు. ఓటింగ్ అసలే లేదు. అయినా…
పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించారు. సరస్వతి సిమెంట్స్ కోసం భూములను రైతులకు ఇష్టం లేకుండా గత ప్రభుత్వాలు తీసుకున్నాయని మండిపడ్డారు. కేవలం ఫర్నిచర్ వాడుకున్నారని నెపంతో స్పీకర్గా పనిచేసిన వ్యక్తిని వేదనకు గురి చేశారని విమర్శించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసీపీకి గుడ్బై చెప్పడంతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు సుధీర్..