వైసీపీ, బీజేపీ యువ నేతల మాటల యుద్ధం నడుస్తోంది.. టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెస్ కు కోటి రూపాయల విడుదల చేయడంపై వివాదం మొదలైంది.. తిరుపతి పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించినప్పుడు అడ్డుకున్న భానుప్రకాష్ రెడ్డి.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు కేటాయింపుపై ఏ సమాధానం చెప్తారంటూ భూమన అభినయ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు..
మూడేళ్ల వైసీపీ పరిపాలనలో రాయలసీమ రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుందన్నారు. రాయలసీమలో పర్యటించకపోయిన ఫర్లేదు…. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ప్రజా తీర్పు…వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యం,క్రీడల పై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి…
ఏపీలో వైసీపీ పాలనపై మండిపడ్డారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఆత్మకూరులో బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అప్పుల మీదే పరిపాలన జరుగుతుంది. అవగాహనా రాహిత్యంతో పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీ ఒక ప్రైవేట్ కంపెనీ అన్నారు. మోడీ 130 సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిస్తే జగన్ కేవలం నవరత్నాల పేరిట స్టిక్కర్ మార్చుకొని పరిపాలన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ కుటుంబ వారసత్వ రాజకీయాలకు…