అధికార పార్టీ నేతలు ఉగ్రవాదులకు అండగా ఉంటున్నారంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐలను వైసీపీ మిత్రపక్షాలుగా చూస్తోందంటూ విష్ణు మండిపడ్డారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి.ఈ రెండు ఉగ్రవాద సంస్థలపై జాతీయ భద్రతా సంస్థలు నిఘా పెడుతున్నాయి.ఉగ్రవాద సంస్థల కదలికల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సంస్థలకు షెల్టర్ జోన్లుగా తయారయ్యాయి.
డెప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి వంటి వారు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారు.ఆత్మకూరు పోలీస్ స్టేషను తగులబెట్టిన వాళ్లపై కేసులు పెట్టొద్దని అధికార పార్టీ నేతలు ఒత్తిడి పెట్టారు.గుంటూరు, రాయచోటి పోలీస్ స్టేషన్లను తగుల పెట్టిన వారిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారు.పీఎఫ్ఐ, ఎస్డీపీఐ పార్టీలు వైసీపీ మిత్రపక్షాలా..?పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులపై ఉన్న కేసులను ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందా..?జైళ్ల నుంచి విడుదలైన పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులతో కలిసి ర్యాలీలు చేస్తారా..? అని ప్రశ్నించారు విష్ణువర్థన్ రెడ్డి.
Read Also: Anesthetic Injection: నా ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉంది.. ఎన్టీవీతో డాక్టర్ శశిబాల
ఉగ్రవాద సంస్థల ప్రతినిధులతో గతంలో హోం మంత్రిగా ఉన్న సుచరిత చర్చలు జరుపుతారా..?తనను పొగిడించుకోవడానికి లేదా కొత్త సమస్యలు సృష్టించడానికి జగన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.పేర్లు మార్చి.. స్టిక్కర్లు మార్చి లాభం పొందాలని వైసీపీ భావిస్తోంది.వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు మార్చడం కాదు.. ప్రజల హృదయాలను గెలవండి.పేర్లు మార్చాలనుకుంటే గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చండి.పాకిస్తాన్ మూలాలున్న జిన్నా పేరుతో గుంటూరులో టవరా..?జిన్నా టవరుకు అబ్దుల్ కలాం పేరు పెట్టండి. కింగ్ జార్జ్ ఆస్పత్రికి అల్లూరి సీతారామారాజు పేరు పెట్టుకోండి.
మీ కంపెనీలకు మీ పేర్లు పెట్టుకొండి.. ప్రజాధనంతో ఏర్పాటైన సంస్థలకు మీ పేర్లెందుకు..?పోలవరానికి కేంద్రం నిధులిస్తోంది కదా..? వాజ్ పేయి పేరు పెట్టండి.అనవసరంగా హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పిడి అంశం తెర మీదకు తెచ్చారు.వైసీపీ అజెండా ఫిక్స్ చేస్తే.. టీడీపీ ఆ అజెండాను ఫాలో అవుతుంది.టీడీపీ వైసీపీ ట్రాపులో పడకూడదు.కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీలను తామే పెట్టినట్టు జగన్ చెప్పుకుంటున్నారు.ఏపీని వైసీపీ తమ శాశ్వత సామ్రాజ్యంగా భావిస్తోంది.ప్రాంతీయ పార్టీలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండదు.పక్క రాష్ట్రంలో జెండా ఉండదు.. టీడీపీ జాతీయ పార్టీగా చెప్పుకుంటుందన్నారు విష్ణువర్థన్ రెడ్డి.
Read ALso: Yanamala Ramakrishnudu: అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు.. నియంత పోకడలు