ఏపీలో బీజేపీ వైసీపీ పార్టీల మధ్య మాటల దాడి తారస్థాయికి చేరుకుంటోంది. ఈ నెల 13వ తేదీన జరగనున్న శాసనమండలి ఎన్నికలలో కూడా ఓటర్లను కోనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం అన్నారు బీజేపీ నేత విష్ణువర్దన రెడ్డి. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఈ అంశం పై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈనెల 13న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఏపీలో వైజాగ్ లో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని నిర్వహించారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన పెట్టబడుల సదస్సుపై విమర్శలు చేసిన వైసీపీ…ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పెట్టుబడులకు సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చెయ్యాలన్నారు. జనసేన,బిజేపి మధ్య పొత్తు కొనసాగుతుంది. కొన్ని పార్టీలు మాత్రం విడిపోవాలని కోరుకుంటున్నాయన్నారు వారి కోర్కేలు తీరవన్నారు.
Read Also:Bhadradri Temple : భద్రాద్రి ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం.. ఇద్దరు అర్చకులకు మెమోలు
బీజేపీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ అమరావతిలో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని వైసీపీ కుట్ర చేస్తుంది.బీజేపీకి బలం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తుంది. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు ఉన్నాయి.వాలంటీర్లు వ్యవస్థను వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.విశ్వవిద్యాలయం వీసీ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.వీటన్నింటి పైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం.ఎమ్మెల్సీ మాధవ్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు.ఏపీకి మోడీ ఎంతో సాయం చేస్తున్నారు.అందరూ ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి.వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలను పార్టీ కోసం వాడుకుంటుంది.అధికారం ఉంది కదా అని.. అధికారుల పై ఒత్తిడి తేవడం సరి కాదు.కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి.. ఎన్నికల సంఘానికి అందిస్తాం అన్నారు బీజేపీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ.
Read Also: Ravanasura: ఇప్పటివరకూ రవితేజని హీరోగా చూశారు… ఇకపై ‘రావణాసుర’గా చూస్తారు