ఏపీలో ఎన్నికలకు ముందే పొత్తు పొడుపులు పొడుస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఈమధ్యే మూడు ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి 1) జనసేన+బీజేపీ పొత్తు, 2) జనసేన+టీడీపీ+బీజేపీ పొత్తు, 3) జనసేన ఒంటరిగా పోటీ చేయడం. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు రెండురోజులుగా ఏపీలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. జేపీ నడ్డాతో జరిపిన కోర్ కమిటీ భేటీలో పౌత్తుల అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. పొత్తులపై…
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారనుందా? అధికార పార్టీతో బీజేపీ ఇక అమీతుమీ తేల్చుకోనుందా? అందుబాటులో ఉన్న ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ వాడివేడిగా సాగింది. బీజేపీ కార్యాలయంలో సమావేశమైన సోము వీర్రాజు, జీవీఎల్, ఐవైఆర్, సత్య కుమార్ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాలపై ఇక యుద్దం చేయాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు కమలనాధులు. తెలంగాణ బీజేపీ తరహాలో ఇకపై ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరించాలని భావిస్తోంది ఏపీ బీజేపీ. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకు…
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు టీడీపీ నిరసనలు, మరోవైపు బీజేపీ సభలతో వైసీపీని టార్గెట్ చేశాయి. అయితే బీజేపీ సభల్ని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏపీలో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదం అన్నారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా. ప్రజలు టీడీపీ,బీజేపి మీద ఆగ్రహంగా వున్నారన్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా బీజేపీ ఏపీ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. రాష్ర్టం అప్పులు చేస్తుందన్న బీజేపీ….కేంద్రం చేస్తున్న అప్పుల సంగతి గుర్తుకు రావడం లేదా? అని…
బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే వైసీపీ, టీడీపీ గుండెల్లో భయం పట్టుకుందన్నారు ఎంపీ సీఎం రమేష్. పేర్ని నాని, పయ్యావుల కామెంట్లు ఆ భయం నుంచి వచ్చినవే. వైసీపీలో ఏం జరుగుతుందో పేర్ని నాని ఆలోచించుకోవాలి. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు సహా కార్యకర్తలు.. నేతలు ఏం మాట్లాడుతున్నారో పేర్ని నాని గమనించాలని హితవు పలికారు. వైసీపీలో అంతర్గత పోరు ఉంది. టీడీపీ ప్రతిపక్షంగా ఫెయిలైంది. వైసీపీ చేసిన తప్పులను ప్రజలకు పార్టీ అగ్ర నేతలు ప్రజాగ్రహ సభలో…
బీజేపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఉడుత ఊపులకు భయపడేది లేదని, కేంద్రమే రాష్ట్ర పోలీసులకు ఈ మధ్య అనేక అవార్డులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. ఫెడరల్ విధానంలో ఏ హక్కుతో కేంద్రం రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై నిఘా పెడుతుందో సీఎమ్ రమేష్ చెప్పాలి. సీఎం రమేష్ చంద్రబాబు ఏజెంట్ గా మాట్లాడుతున్నాడు.…
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. భీమిలిలో భూ సంబంధిత సమస్యలు ఎక్కువగావున్నాయని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎండోమెంట్ భూములను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని, భీమిలీలో పదివేల మందికి పైగా ఇళ్లపట్టాలిచ్చామని పేర్కొన్నారు. ఓటీఎస్ పై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కడుతున్నారని ఎవరినీ బలవంతం పెట్టడం లేదని ఆయన తెలిపారు. ఓటీఎస్ కట్టని వారికి…
బద్వేల్ నియోజక వర్గం ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరిగింది. మంగళవారం ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అవుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పోటీలో వున్నారు. ఆమె భారీ మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. బద్వేల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 7 సార్లు, టిడిపి 4 సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా,…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప పోరు రసవత్తరంగా సాగింది. అయితే, తెలంగాణలోని హుజురాబాద్ తో పోలిస్తే ఏపీలోని బద్వేలులో అంతగా జనం ఆసక్తి చూపించలేదు. బద్వేల్ లో టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో పోటీ అంతగా కనిపించలేదు. అధికార వైసీపీ అభ్యర్ధిని పరిగణనలోకి తీసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 9 శాతం తక్కువగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 76.37 శాతం నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం 68.12గా నమోదైంది. బద్వేలు…
కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇవాళ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.. రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది.. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్నా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ తరపున ఏజెంట్లుగా కూర్చోవడం చర్చగా మారింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూయడంతో వచ్చిన ఈ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థిని పెట్టలేదు.. కానీ, బీజేపీ పోటీకి నిలిచింది.. అయితే, ఆ పార్టీకి సరైన…
ఈనెల 30న జరుగనున్న బద్వేల్ ఉప ఎన్నిక కోసం అధికార వైసీపీ, విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బద్వేల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురుగన్ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో బద్వేల్ అభివృద్ధి జరగలేదన్నారు కేంద్ర మంత్రి మురుగన్. అభివృద్ధి ప్రభుత్వం కావాలో.. లిక్కర్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలన్నారు. బద్వేల్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురగన్ కడప…